Thursday, May 19, 2022
Homelatestబాబును మళ్లీ కెలుకుతున్న శివప్రసాద్

బాబును మళ్లీ కెలుకుతున్న శివప్రసాద్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కు ఈ మధ్య కాలంలో చాదస్తం ఎక్కువైనట్లుంది. చంద్రబాబు ఎన్నిసార్లు క్లాస్ పీకినా ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఈయనేదో దళిత జనోద్ధారకుడిలా పోజు కొడుతూ మార్కులు వేయించుకోవడానికి.. టీడీపీ నేత అనే విషయం మరిచి ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం తల పట్టుకుంటోంది. ఇప్పటికే శివప్రసాద్ వ్యవహారశైలి గురించి సీఎంకు చాలా కంప్లైంట్లు వెళ్లాయి. తాజాగా దళిత వాడలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు శివప్రసాద్ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.

మొన్నటికి మొన్న టీడీపీ దళిత వ్యతిరేక పనులు చేస్తోందంటూ నోరు పారేసుకున్న శివప్రసాద్… బాబు వార్నింగ్ తో దిగొచ్చారు. చంద్రబాబు చిత్తూరు టూర్లో ఆయన వెంట తిరిగి, ఓ లెవల్లో భజన చేశారు. కానీ మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కొప్పెడు హరిజనవాడలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. అయితే స్థానికులు మాత్రం ప్లాంట్ వద్దని ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీగా నచ్చజెప్పకుండా.. వారితో కలిసి నిరసన తెలిపి శివప్రసాద్ అందరికీ షాకిచ్చారు.

ఓవైపు స్థానిక ఆర్డీవో కల్పించుకుని ప్లాంట్ కు అనుమతులున్నాయని, ప్రభుత్వం జీవో ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కేసు కోర్టులో ఉందని, త్వరలో తేలుతుందని కూడా నచ్చజెప్పారు. కానీ శివప్రసాద్ మాత్రం ఓ చోట అనుమతులుంటే.. మరోచోట నిర్మిస్తున్నారన్న స్థానికుల వాదనకే మద్దతు పలికారు. మొన్నటికి మొన్న మహానాడులో కట్టుదాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని బాబు హెచ్చరించారు. తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తుండటంతో.. శివప్రసాద్ పై సీరియస్ గా ఉన్నారట.

- Advertisment -
spot_img

Most Popular