చిరాకు పుట్టిస్తున్న శివగామి, కట్టప్ప రొమాన్స్‌

0
749

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]


ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఫీవర్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ సినిమాలోని ప్రతి పాత్ర గురించి కథలు కథలుగా ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ప్రతి పాత్ర గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో సినిమా మద్యలో వస్తున్న ఒక యాడ్‌ చిరాకు తెస్తుంది. ‘బాహుబలి 2’ సినిమా చూస్తున్న సమయంలో ఇంటర్వెల్‌ సమయంలో తమిళ ప్రేక్షకుల ముందుకు ఈ యాడ్‌ వస్తుంది. కట్టప్ప, శివగామిల మద్య రొమాంటిక్‌ సన్నివేశంతో ఆ యాడ్‌ ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్‌ల కాంబినేషన్‌లో పోతిస్‌ యాడ్‌ చిత్రీకరించారు. ఆ యాడ్‌కు ప్రస్తుతం భారీ పబ్లిసిటీ వచ్చింది. పోతిస్‌ యాజమాన్యం ప్రస్తుతం బాహుబలి ఫీవర్‌ నడుస్తున్న నేపథ్యంలో ఇలా ప్లాన్‌ చేశారు. అయితే కొందరికి ఇది పరమ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో ఆమె రాజ మాత, కట్టప్ప రాజు ఆజ్ఞ పాటించే వ్యక్తి. అలాంటి పాత్రను ఇలా చూపించడంతో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply