అన్నీ వున్నా ఆ ఒక్క తప్పుకి నిషిత్ బలి?

0
714
small mistake made nithish to death

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

small mistake made nithish to death
మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణానికి ఒకే ఒక్క తప్పు ప్రధాన కారణమైంది.ప్రమాదం జరిగిన బెంజ్ కారుకి ఎన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ నిషిత్ చేసిన తప్పుకి అవేమీ పని చేయకుండా పోయాయి.ఆ రక్షణ వ్యవస్థ,తప్పు గురించి వివరంగా తెలుసుకుందాం..

నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అత్యంత ఖరీదు అయినది.అందులో ప్రమాదం జరిగినప్పుడు లోపలవున్న వారిని రక్షించేందుకు 8 ఎయిర్ బాగ్ లు వున్నాయి. దీంతో పాటు ప్రపంచ మేటి సేఫ్టీ మెజర్స్ వున్నాయి.పవర్ ఫుల్ abs ,ebd బ్రేకింగ్ సిస్టం వుంది.ఇక ప్రమాదం జరిగిన టైం లో ఏ ట్రాఫిక్ సమస్యా లేదు.విశాలమైన రహదారి.ఇక డ్రైవింగ్ లో నిషిత్ కి ఎప్పటినుంచో అనుభవం. పక్కనే మిత్రుడు..ఇంకో కిలోమీటర్ దూరంలో ఇల్లు.ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అనే పెద్ద తప్పు కారణం గా నిషిత్ రోడ్డు ప్రమాదానికి బలైపోయాడు.ఇక మితిమించిన వేగం కూడా ఇంకో కారణం.ఈ రెండు తప్పులు జరక్కుండా ఉంటే నిషిత్ ప్రాణాలతో ఉండేవాడు.ఈ ప్రమాదం ఇంకోసారి సెలెబ్రెటీ లు అందరికీ,మరీ ముఖ్యంగా యువతకి ఓ హెచ్చరిక. సీట్ బెల్ట్ విషయంలో ఏమరుపాటు తగదని వార్నింగ్.

Leave a Reply