మళ్లీ చిన్న నిర్మాతల ఫైర్………    

0
797
small producers fire
                                     small producers fire
                                         ధియేటర్స్ లీజ్ మరియు క్యూబ్ యూ ప్  ఓ రేట్లు తగ్గించాలిలని పోరాటం చేస్తున్న ఆర్ కె గౌడ్ కి నిర్మాతలు సంఘీభావం  ప్రకటించారు ఈరోజు ఫిలింఛాంబర్ దగ్గర నిర్మాతలు అందరూ సమావేశం అయ్యారు వారి సమస్యలు పరిస్కారం కావడానికి ధర్నా మొదలు పెట్టారు ఈ సందర్బంగా  నిర్మాతలు వారి డిమాండ్స్ తెలియజేయడం జరిగింది  ఇవి వారి డిమాండ్స్  …….
రెండు తెలుగురాష్ట్రాల్లో చాలా థియేటర్స్ మరియు క్యూబ్  మరియు యూ ఎఫ్ ఓ సిస్టమ్స్ కొందరి సినిమా పరిశ్రమ పెద్దల చేతుల్లో ఉన్నాయి  అలా ఉండటంవల్ల చిన్న నిర్మాత లకు థియేటర్స్ దొరకటం లేదు ఒక వేల దొరికినా క్యూబ్ ,యూ ఎఫ్ ఓ ల పేరిట ఒక్క వారానికి  పదివేల ఎనిమిది వందల నుండి పన్నెండువేలు వసూలు చేస్తున్నారు అదే పక్క రాష్ట్రాల్లో ఒక్క వారానికి రెండువేలమూడువందలు నుండి రెండువేలఐదువందలు వసూలు చేస్తున్నారు మన దగ్గర ఎక్కువ వసూలు చేస్తూ నిర్మాతలను అన్యాయం చేస్తున్నారు
ఉదా..  సత్యం థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తే ఒక్క వారానికి క్యూబ్ / యూ ఎఫ్ ఓ  నిర్వాహకులు నిర్మాతనుండి రెండు లక్షల  యాబై వేలు తీసుకుంటున్నారు అసలు తీసుకోవాల్సింది లక్షా ముప్పై వేలు మరి ఇంకో లక్ష ఇరవై వేలు ఎందుకు వసూలు చేస్తున్నారు ఇలా  చేస్కుంటూపోతే నిర్మాత పరిస్థితి ఏంటి వాళ్ళు మాత్రం కోట్లు గడిస్తున్నారు దానికి ప్రభుత్వానికి టాక్స్ కూడా చెల్లించకుండా మోసం చేస్తున్నారు అంత బ్లాక్  మయం చేస్తున్నారు ఇదంతా కొంత మంది సినీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుంది ఒక మాఫియా లాగా తయారయ్యి కలిసికట్టుగా దోపిడీ …….
సినిమా పరిశ్రమను దోపిడీ చేస్తున్నారు నిర్మాతలను నిట్టనిలువుదోపిడి చేస్తున్నారు ఇకనైనా ఈ దోపిడీ వ్యవస్థ నుండి పరిశ్రమను కాపాడాలి.  థియేటర్స్ లీస్ పద్దతి కాకుండా పర్శంటేజ్  పద్దతిలో నడవాలి అప్పుడే నిర్మాత బతికి బయటపడతాడు దేశానికీ స్వాతంత్ర వచ్చిందేమోగాని తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకా  రాలేదు ఇది మరోపోరాటం చిన్న సినిమా బ్రతకాలని పోరాటం అందుకే ధర్నా తో మోదలుపెట్టాం త్వరలోనే క్యూబ్ యూ ఎఫ్ ఓ ల నిర్వాహకుల ఆఫీస్  ఎదుట నిరాహార దీక్ష చేస్తాం ఎంత వరకు అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరేవరకు మాకు న్యాయం జరిగిగేవరకు మాకు తక్షణమే న్యాయం జరగాలి  ఇది మా పోరాటం అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో  ఆర్ కె గౌడ్ తోపాటు సాయి వెంకట్ , జీవి చౌదరి ,జడ్చర్ల నాగరాజు ,ప్రసాద్ ,సురేష్ కుమార్ ,శ్రీరంగం  సతీష్ ,పసుపులేటి కిషన్ యాదవ్, మద్ది వీరారెడ్డి  తదితరులు పాల్గొన్నారు

Leave a Reply