బుల్లి తెర నుంచి బుజ్జి తెరకు ..

small screen mini screen

సమాచార,వినోద రంగాల్లో బుల్లితెర ఓ సంచలనం ..దాదాపు రెండు దశాబ్దాలపాటు ఈ బుల్లితెర తెలుగింటి నిండా పెద్ద తెర అయ్యింది.ఇబ్బడిముబ్బడిగా చానళ్ళు వచ్చేశాయి.ఇక న్యూస్ విభాగంలో చెప్పే పనిలేదు …ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 20 కి పైగా న్యూస్ చానళ్ళు వచ్చాయి.24 గంటలపాటు న్యూస్ అంటూ ప్రేక్షకుడిని కట్టిపడేశాయి .ఉద్యమ ,రాజకీయ వేడి రగలడంతో ఈ చానళ్ళు బాగానే బతికాయి. విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది .న్యూస్ చానళ్లు చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది .ఆ ప్రభావం ప్రకటనలపై ..తద్వారా సంస్థల ఆదాయం పై పడింది .ఇంకేముంది యాజమాన్యాలకు నష్టాలు తప్పలేదు.వరుస నష్టాలతో చాలా మంది మూసివేత ఆలోచన చేస్తున్నారు .మరికొన్ని సంస్థలు జీతాలు కూడా ఇవ్వలేక నానాపాట్లు పడుతున్నాయి.ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం వైపు కొన్ని సంస్థల అడుగులు పడుతున్నాయి .

ఏంటా ప్రత్యామ్న్యాయం ? బుజ్జి తెర ..అదేనండి ..యు ట్యూబ్ ఛానల్ ..ఇప్పటికే బుల్లితెర రంగంలో విజయం సాధించిన tv9,tv5 ఇక్కడా ముందడుగు వేశాయి. noix పేరుతో tv9 రెండుమూడు చానెల్స్ ప్రారంభించింది . tv5 కూడా tv5 మనీ పేరిట ఇటీవలే యు ట్యూబ్ ఛానల్ ప్రారంభించింది .ఈ రంగ భవిష్యత్ బావుంటుందని నిపుణులు చెప్పడం ,అంతర్జాతీయం గా వస్తున్నఫలితాలు నిరూపించడం తో మిగిలిన మీడియా సంస్థలు కూడా బుజ్జి తెర పై దృష్టి పెడుతున్నాయి

SHARE