సంపూర్నేష్‌బాబు సంచలనం సృష్టించేలా ఉన్నాడు!!

0
271
smapurnesh babu cretaing sensation with kobbarimatta

Posted [relativedate]

smapurnesh babu cretaing sensation with kobbarimatta
‘హృదయకాలేయం’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోను అంటూ పరిచయం అయిన సంపూర్నేష్‌బాబు ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సంపూకు చెందిన ఒక పోస్టర్‌ను రాజమౌళి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో సంపూ పడ్డాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన సంపూ గత కొంత కాలంగా పూర్తిగా ‘కొబ్బరిమట్ట’ చిత్రంపైనే ఫోకస్‌ పెట్టాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సినిమాను నాన్చుతూ, ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతూ వస్తున్న సంపూర్నేష్‌బాబు త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ చిత్రంలో మూడు విభిన్నపాత్రల్లో సంపూ కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌, ఇటీవల విడుదలైన పాట సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. దాంతో ఈ సినిమా చిన్న చిత్రాల హీరోల రికార్డును బ్రేక్‌ చేస్తుందా ఏంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘హృదయకాలేయం’ను తెరకెక్కించిన స్టిఫెన్‌ శంకర్‌ ‘కొబ్బరిమట్ట’కు కథ మరియు కథనంను అందిస్తున్నాడు. ఆసక్తిని రేపుతున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టడం అయితే కన్ఫర్మ్‌. ఇక లాంగ్‌ రన్‌లో కూడా ఈ సినిమా 15 నుండి 20 కోట్ల వరకు వసూళ్లు చేసి సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

Leave a Reply