ఈ మాట రాతవుతుంది..

0
658

  smart phone new typing feature it name baidu deep speech 2స్మార్ట్ ఫోన్ల‌లో ఇక‌పై మాట్లాడితే మెసేజ్ ను కంపోజ్ చేసే సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రాబోతున్నట్టు వాషింగ్టన్ కు చెందిన స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జేమ్స్ లిండాయ్ తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ వ‌స్తే గంట‌ల త‌ర‌బ‌డి క్వ‌ర్టీ కీ ప్యాడ్ పై ప్ర‌తి అక్షరాన్ని టైప్ చేసే అవసరం ఉండదని తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ పేరు బైదూస్ డీప్ స్పీచ్ 2 అని వెల్లడించారీయన. ఇది క్లౌడ్ బేస్డ్ స్పీచ్ రికగ్నిషన్ సహాయంతో 32 రకాల అక్షరాలను వాడి మాట్లాడే స్పీచ్ లను విని కంపోజ్ చేయగలదని తెలిపారు.

దాదాపు 100 జాతీయాలు(ఈడియ‌మ్స్ అండ్ ప్రేసెస్) దానికి సంబంధించిన ప‌దం టైప్ చేయ‌గానే రిలేటెడ్ ప్రొవ‌ర్బ్స్ ఆటోమేటిక్ గా చూపిస్తుంద‌న్నారు.   ఈ యాప్ అందుబాటులోకి వస్తే..ఇక టైపింగ్ బాధ త‌ప్పుతుందంటున్నారు చిట్ చాట్ ల‌వ‌ర్స్. క్వర్టీ కీ ప్యాడ్ కలిగిన ఆండ్రాయిడ్ , యాపిల్ ఐఫోన్లలో అందుబాటులోకి రానున్నట్టు తెలియజేశారు కంప్యూటర్ సైన్స్ ఎక్స్ పర్ట్స్. స్పీచ్ ను విని నోట్ రాసే సాఫ్ట్ వేర్ ను మొద‌ట ఆంగ్లంలో టెస్టు చేశారు.

అనంత‌రం చైనీస్ లోని మాండ‌రిన్ లోనూ ప‌రీక్షించిన‌ట్టు వెల్ల‌డించారు కంప్యూట‌ర్ సైన్స్ లో పీహెచ్ డీ నిపుణులు సెర్రీ రువాన్. మ‌నం టైప్ చేసిన దానికంటే మూడు రెట్ల వేగంతో ఆ సాఫ్ట్ వేర్ మెసేజ్ ను కంపోజ్ చేస్తోంద‌ని తెలిపారాయ‌న‌. ఇంగ్లీష్ లో అక్ష‌ర‌దోషాల రేటు 20 శాతం కాగా చైనీస్ లో అది 60 శాతంగా ఉన్న‌ట్టు గుర్తించారు. కంపోజింగ్ వేగం ఇంకా స్పీడ‌ప్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు రువాన్.

Leave a Reply