స్మార్ట్‌ఫోన్లు వాడితే ఇలా జరుగుతుందా.?

  smartphone use very dangerous causes health problems

స్మార్ట్‌ఫోన్ల వాడకంలో ఇండియా రోజుకో స్థానం ఎగబాకుతోంది. ఇందులో ఎక్కువ శాతం టీనేజర్స్ ఉండడమే దీనికి కారణం. అయితే మొబైల్స్ వాడే టీనేజర్స్‌కు ఒక విధంగా ఇది చేదు వార్తే. ముంబయికి చెందిన ఓ హాస్పిటల్ చేసిన స్టడీలో భయానక విషయం వెలుగుచూసింది. ఇండియాలో మొబైల్‌ను వినియోగించే యువతలో దాదాపు 50 శాతం మంది వెన్ను సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది. ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని వేరే పనులు చేసుకుంటూ, బండి నడుపుతూ భుజానికి ఆనించి ఫోన్ మాట్లాడడమే దీనికి కారణమని తేలింది. అయితే ఇది కొన్నాళ్లకు పరిష్కారానికి నోచుకోని వెన్ను సమస్యగా మారుతుందని స్టడీ నిర్వహించిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

smఅతిగా మొబైల్‌ను వాడితే ఇలాంటి సమస్యలు రావడం ఖాయమని వారు చెప్పారు. ముంబయిలోని లీలావతి హాస్పటల్ చేసిన ఈ సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఇండియాలో మొబైల్‌ను వినియోగించే 79 శాతం మందిలో, 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు నిద్రమేల్కొనే సమయంలో సెల్‌ఫోన్ చేతిలో లేకుండా గడిపే సమయం కేవలం రెండు గంటలేనట. మిగిలిన సమయమంతా దాదాపు ఫోన్ గురించే వారి ధ్యాసంతా ఉంటుందని తేలింది. అంతేకాదు, అతిగా మొబైల్ వాడకం వల్ల అనేక మానసిక రుగ్మతలకు కూడా కారణమవుతోందని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here