అమ్మ మళ్లీ నటిస్తోంది ..

  sneha again act mammutty wife character

తెలుగుతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీలోని పలు భాషల్లో నటించి మంచిపేరు తెచ్చుకుంది స్నేహ. తెలుగులో చివరగా సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్రకు భార్యగా నటించి బ్రేక్ తీసుకుంది. ప్రెగ్నెంట్ కావడంతోనే ఈ తెలుగుందం కెమేరాకు దూరమైంది. 2015 ఆగస్టులో విహాన్ కు జన్మనిచ్చింది స్నేహ. పిల్లాడి ఆలనపాలనలో తలమునకలై ఉన్న ఆమె దగ్గరకు మలయాళ స్టార్ హీరో ముమ్మట్టితో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో స్నేహది ముమ్మట్టికి భార్య రోల్. ఫ్యామిలీ డ్రామానే అయినా థ్రిల్లర్ అంశాలు చాలా ఉంటాయట. ఈ ప్రాజెక్టు అనుకున్నపుడే స్నేహనే తీసుకోవాలని భావించారట దర్శకనిర్మాతలు. కానీ ఆమె చేస్తుందో చేయదో అనే అనుమానంతో నయనతార సహా పలువురిని పరిశీలించారట.

ఓ సారి స్నేహను అడిగి చూద్దామనుకుని ఆమెకు ప్రపోజల్ పంపింది చిత్రబృందం. పిల్లాడి వయసు ఇంకా ఏడాది మాత్రమే కావడంతో.. మొదట ఆలోచించిన స్నేహ.. కథ విన్న తర్వాత ఇంప్రెస్‌ అయిపోయి సైన్ చేసేసిందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయిపోవడంతో.. మరో రెండు వారాల్లో షూటింగ్ ప్రారంభంకానుంది.

SHARE