సోలార్‌ ఛార్జింగ్‌ పవర్‌ బ్యాంక్‌…

 Posted October 28, 2016

solar charging power bankసోలార్‌ ఛార్జింగ్‌ పవర్‌ బ్యాంక్‌ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో సౌరశక్తితో ఛార్జ్‌ అయ్యే పవర్‌ బ్యాంక్‌ను ఢిల్లీకి చెందిన యూఐఎంఐ టెక్నాలజీస్‌ సంస్థ తయారు చేస్తుంది. ఒక వైపు సోలార్‌ పరర్‌తో ఛార్జింగ్‌ పనిచేస్తూనే రెగ్యులర్‌ తరహాలో కూడా ఛార్జ్‌ చేసుకున అవకాశం ఉంది. మొత్తం 6వేల ఎంఏహెచ్‌ శక్తితో ఉండే ఈ పవర్‌ బ్యాంక్ ధర రూ.799గా నిర్ణయించినట్లు సంస్త ప్రకటించింది. ఈ కామర్స్‌ దిగ్గజాల అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, సాప్‌క్లూస్‌, పేటిఎం వంటి సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఒక ఇన్‌పుట్‌ ఉన్న ఈ పవర్‌ బ్యాంక్‌..రెండు యూఎస్‌బీ పోర్టులు వస్తాయి.దాంతో ఒక సారి రెండు మొబైళ్లను చార్జింగ్‌ చేసుకునే సౌకర్యం వస్తుంది. పైన రబ్బరు ఫినిషింగ్‌తో ఉంటుంది. దీనికి 2.4 వాట్స్‌ ఎల్‌ఈడీ ప్యానల్ లైట్‌ కూడా రానుంది. వాటర్‌, డస్ట్‌ ప్రూఫ్‌తో రావడం దీని ప్రత్యేకత…మరెందుకు ఆలస్యం త్వరలో అందుబాటులోకి రానున్న ఈ పవర్‌ బ్యాంకును సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి మరి.

SHARE