రోజుకి ఇన్ని వేల వాహనాలు …

0
544

 somany vehicles registrations day indiaఇండియాలో వాహన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 1993 వరకు అంతంతమాత్రంగా ఉన్న వాహనాల కొనుగోళ్లు, ఆపై మారిన జీవనశైలితో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కేంద్ర రవాణా శాఖ అందించిన గణాంకాల ప్రకారం, 2015లో వాహనాల రిజిస్ట్రేషన్ రికార్డు స్థాయికి చేరుకుంది. గతేడాది ఏకంగా 1.96 కోట్ల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.

అంటే సగటున ప్రతి రోజు 53,720 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయన్నమాట. 20 ఏళ్ల క్రితం వరకూ వాహనాల రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉండేది. ఏడాదికి 10 లక్షల లోపులోనే వాహనాలు రిజిస్టర్ అవుతుండేవి. ఆ తర్వాత కాలంపాటు కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చిన వాహనాల అమ్మకాలు, 2010 తర్వాత గణనీయంగా పెరిగాయి. 2014లో 1.94 కోట్ల వాహనాలు రిజిస్టర్ కాగా 2015లో ఆ సంఖ్య 1.96 కోట్లకు చేరుకుంది..

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే యూపీ ఈ విషయంలో ముందంజలో ఉంది. 2015లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 24.38 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 19.91 లక్షల వాహనాలతో మహార్రాష్ట రెండో స్థానంలో ఉండగా కర్ణాటక 15.15 లక్షల వాహనాలతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.. రిజిస్టర్ అవుతున్న కొత్త వాహనాల్లో 75 శాతం ద్విచక్ర వాహనాలే. ప్రస్తుతం 18.6 కోట్లు ఉన్న వాహనాల సంఖ్య మరో 20-30 ఏళ్లలో తక్కువలో తక్కువగా 35 కోట్లకు చేరుకుంటుంది. 

Leave a Reply