జగన్ నోటికి రెడ్డిగారి ప్లాస్టర్?

Posted April 13, 2017

somireddy master plan to jagan
రాజకీయం క్రికెట్ ఆట..ఆంధ్రప్రదేశ్ మైదానం అనుకుంటే,ఈ మధ్య క్రీజ్ లో దిగిన ప్రతిసారి జగన్ డకౌట్ అవుతున్నాడు.అంతకన్నా బ్యాడ్ లక్ ఏమిటంటే…ఆయన హిట్ వికెట్ అవుతున్నాడు. బంతిని కొట్టాల్సిన బ్యాట్ తో వికెట్స్ ని ఈడ్చి కొట్టేస్తున్నాడు.అందుకు తాజా ఉదాహరణ చంద్రబాబు ఇల్లు.ఆయన తన భార్య పేరిట వున్న స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుంటే నానాయాగీ చేద్దామని జగన్ అండ్ కో చేసిన ప్రయత్నం పూర్తిగా వికటించింది.ఇంటర్నెట్ లో అంబానీ,విజయ్ మాల్యా లాంటి వాళ్ళ ఇళ్ల ఫోటోలు,డిజైన్లు డౌన్ లోడ్ చేసుకుని వాటితో బాబు ఇంటికి లింక్ పెట్టాలని చేసిన ప్రయత్నాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే జగన్ అండ్ కో ప్రయత్నాలు బట్టబయలై వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.ఈ వ్యవహారంలో కొందరు దేశం నేతలు ఇంకో అడుగు ముందుకేసి పోలీస్ కేస్ దాకా వెళ్లారు.ఆ టైం లో సీన్ లోకి వచ్చిన నెల్లూరు పెద్ద రెడ్డి గారు ఒక్క సారిగా జగన్ నోటికి ప్లాస్టర్ వేసే స్థాయికి వేసేసారు.ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా …

జగన్ దూకుడు నుంచి డిఫెన్స్ కోసం,ఆయన మీద ఆఫెన్స్ ఆడడం కోసం సోమిరెడ్డి ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు.ఆయన పదవి తీసుకున్న వారం రోజుల్లోపే జగన్ ఓ ఈజీ బంతి వేసాడు.సోమిరెడ్డి దాన్ని సిక్సర్ గా మలిచాడు.బాబు ఇంటి వ్యవహారాన్ని వాడుకుని జగన్ అండ్ కో నోటికి ప్లాస్టర్ వేసినంత పని చేసాడు.ఇంతకీ సోమిరెడ్డి గొప్పగా ప్రయత్నించింది లేదు. ఉన్న నిజాన్ని బయటపెట్టేందుకు ఓ చిన్న సవాల్ చేసాడు అంతే .జర్నలిస్టుల్ని తీసుకెళ్లి చంద్రబాబు,జగన్ ఇళ్లు చూసొద్దాం…మీరు రెడీనా అని సోమిరెడ్డి సవాల్ చేశారు.అదే జరిగితే తమ బండారం బయటపడుతుందని జగన్ అండ్ కో కి తెలియదా ? అందుకే ఆ నోళ్లు మూతపడుతున్నాయి.రెడ్డి గారి ప్లాస్టర్ పనిచేస్తోంది.

SHARE