జనసేనాని తల్లిని కలిసిన సోమిరెడ్డి

0
516
somireddy met pawan kalyan mother

Posted [relativedate]

somireddy met pawan kalyan motherటీడీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా పేరున్న జనసేన జెండా కిందకు చేరిపోతారా.. ఆయన పవన్ తల్లితో ఎందుకు భేటీ అయ్యారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి సోమిరెడ్డి కుటుంబం టీడీపీ పట్ల ఎప్పట్నుంచో విధేయతగా ఉంటోంది. చంద్రబాబుకు నమ్మిన బంట్లలో సోమిరెడ్డి కూడా ఒకరు. అందుకే చంద్రబాబు ఏరికోరి ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. మరి ఇంత చేస్తే సోమిరెడ్డి ఎందుకు పవన్ తల్లిని కలిశారని అటు టీడీపీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

కానీ సోమిరెడ్డి ఏం చేసినా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయని ఆయన అనచురులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పవన్ అభిమానుల ఓట్లు కీలకమయ్యాయి. ఇప్పుడు జనసేనాని తల్లిని కలవడం ద్వారా వారిని తనవైపు తిప్పుకోవాలనేది సోమిరెడ్డి వ్యూహం కావచ్చు. లేదంటే చంద్రబాబు దూతగా సోమిరెడ్డి పవన్ కుటుుంబంతో రాయబారం నడిపే అవకాశమూ ఉంది. తమ నేతకు రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి ఉంది కాబట్టి ఏ సమస్యపై అయినా చర్చించే వీలుందని చెబుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం లేనిపోని డౌట్లు వ్యక్తం చేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటింంచారు. అదే జరిగితే ఎవరికి నష్టమనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మిత్రులను పోగొట్టుకోవడం వివేకం కాదని భావిస్తున్న చంద్రబాబు.. త్వరలోనే పవన్ తో అధికారికంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇందుకు ముందుస్తు సన్నాహకమే సోమిరెడ్డి పవన్ తల్లితో భేటీ కావడమనేది టీడీపీ వర్గాల మాట. ఏదేమైనా మంత్రి కాగానే సోమిరెడ్డి చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫైర్ బ్రాండ్ సోమిరెడ్డి.. ఇప్పుడు ప్లాన్ బ్రాండ్ సోమిరెడ్డి అవుతారా అని చెవులు కొరుక్కుంటున్నారు.

Leave a Reply