సోమిరెడ్డి… ఇది సాధ్యమా..?

somireddy1

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ అధినేత జగన్ పై మండి పడ్డారు… అది రొటీన్ వ్యవహారమే ఈ సారి సోమిరెడ్డి కి వచ్చిన ఐడియా మాత్రం వెరైటీ.. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడం సహజం.. వారి వ్యాఖ్యల్ని ఖండించడం మరీ సహజం.. అయితే సోమిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు… జగన్ వ్యాఖ్యలు, ప్రసంగాలు , ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన చెప్పారు. అందుకే అవేమి ప్రసారం కాకుండా ప్రసార భారతికి లేఖ రాస్తామన్నారు…

రాజకీయ ప్రకటనల్లో రోజురోజుకీ దిగజారుడుతనం చూస్తూనేవున్నాం.. కానీ ఆ దిగజారుడు తనాన్ని అడ్డుకోవడానికి అసలు ప్రసారాలే ఆపమనటం కాస్త వెరైటీయే… ప్రజాస్వామ్య భారతంలో ఇవన్నీ సాధ్యమా.? సోమిరెడ్డి గారు ఓ విషయం లో మాత్రం సక్సెస్ అయ్యారు.. మామూలుగా ఆయన ప్రెస్ మీట్ కి వచ్చే ప్రాధాన్యం కన్నా ఈసారి  ఇంపార్టెన్స్ పెరిగి ఉంటుంది..

Leave a Reply