చెప్పేవాడికి వినేవాడు లోకువని ఓ నానుడి.దాన్ని అక్షరాలా నిజం చేసాడు ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు సోము వీర్రాజు.ఒక్క కమలాన్ని ఒకే సారి మూడు చెవుల్లో పెట్టేసాడు.అదెలాగో చెప్పాలంటే ఆయన గారి ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళ్లాల్సిందే..
టీడీపీ అన్నా చంద్రబాబు అన్నా చిటపడలాడే కమలనాథుల్లో ముందుంటారు సోము వీర్రాజు. టీడీపీ తో బీజేపీ మిత్రధర్మం ఆయన నోటికి కొన్నాళ్లుగా తాళం వేస్తోంది.కానీ సోముకి ఈసారి భలే ఛాన్స్ దొరికింది.అదే మోడీ ,జగన్ భేటీ వ్యవహారం.సందు దొరికింది కదాని ఆయన టీడీపీ ని ఓ ఆట ఆడుకుంటాడని అంతా భావించారు.కానీ ఆయన తలంటు టీడీపీ తో మాత్రమే ఆగలేదు. తన మనసులో కోరికలన్నీ బయటపెట్టి టీడీపీ,వైసీపీ,జనసేనల చెవిలో కమలం పెట్టేసారు.ఆయన మాటల్లో బులెట్ పాయింట్స్ మీరూ చూడండి..
*ప్రధాని మోడీని ఎవరైనా కలవచ్చు..ఎందుకంటే కేసులున్న వైసీపీ నేతల్ని టీడీపీ లోకి తీసుకున్నట్టే
*వైసీపీ ని బీజేపీ లోకి విలీనం చేసే అవకాశం లేదు
* బీజేపీ మీద విమర్శలు చేసినా పవన్ ని తప్పుబట్టలేము.
మొదటి స్టేట్ మెంట్ చూస్తే టీడీపీ కి మంట పుడుతుంది.వైసీపీ చంకలు గుద్దుకుంటుంది .ఇక రెండో ప్రకటన చూస్తే ఆశలపై నీళ్లు చల్లుతున్నారని వైసీపీ బాధపడుతుంది.టీడీపీ సంతోషపడుతుంది.ఇక మూడో స్టేట్ మెంట్ చూస్తే పవన్ అండ్ కో తమ గౌరవం తగ్గలేదని హ్యాపీ గా ఉండొచ్చు .అదే సమయంలో మిత్రపక్షాలు అనుకుంటున్న లెఫ్ట్ పార్టీలకి లేనిపోని డౌట్స్ పవన్ మీద రావచ్చు.అందుకే సోము వీర్రాజు ఒక్క కమలాన్ని ముగ్గురు చెవిలో పెట్టాడనేది.