సోమూ స్పీడు తగ్గింది

 

Posted April 12, 2017

somu veeraraju speed reduced

ఏపీ బీజేపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్న సోమూ వీర్రాజు మొన్నటిదాకా ఫైర్ బ్రాండ్ నేతగా చలామణీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి కంటే ఈయనపేరే మీడియాలో ఎక్కువగా వినిపించేది. ఏపీ సీఎం చంద్రబాబు ను టార్గెట్ చేసి తెగ రెచ్చిపోతుండేవారు. ఓ దశలో వైసీపీ అధినేత జగన్ విమర్శల కంటే మిత్రపక్షానికి చెందిన వీర్రాజు మాటలే టీడీపీని ఎక్కువగా బాథపెట్టాయి. కానీ మిత్రధర్మాన్ని పాటించి బాబు ఊరుకున్నారు. అయితే ఢిల్లీ నుంచి అమిత్ షా మాత్రం సోమూకు ఫుల్ గా క్లాస్ పీకారట. చంద్రబాబును ఇబ్బందిపెడితే సహించేది లేదని హెచ్చరించారట.

అమిత్ షా ఫోన్ వచ్చినప్పట్నుంచీ వీర్రాజు కాస్త తగ్గారు. చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేయడం మానేశారు. అయితే ఉన్నట్లుండి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు దిగ్విజయ్ కు లేదని వాదించారు. మధ్యప్రదేశ్ లో డిపాజిట్ కూడా తెచ్చుకోలేని దిగ్విజయ్.. ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటమెందుకని ఎదురు ప్రశ్నించారు. పైగా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు సోము వీర్రాజు.

ఉన్నట్లుండి సోము వీర్రాజు టార్గెట్ మారిపోయిందేంటని అటు బీజేపీ, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ సమీకరణలా దృష్ట్యా చంద్రబాబు మిత్రుడిగా ఉండటం బీజేపీకి చాలా అవసరం. ఎంత ఫుల్ మెజార్టీ ఉన్నా.. వీలైనన్ని ఎక్కువ పార్టీలు కూటమిలో ఉంటేనే.. అందరి మాటకు విలువిస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళుతుంది. అందర్నీ కోఆర్డినేట్ చేయాలంటే చంద్రబాబు లాంటి సమర్థుడు అవసరమని.. ఇటీవలి ఎన్డీఏ మీటింగ్ లో మోడీ ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతే చెప్పింది. అందుకే అగ్రనేతలే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు.. తాను బాబుకు చెడ్డ కావడం ఎందుకులే అని సోముకు తత్వం బోధపడింది.

SHARE