కత్తి మడిచిపెట్టిన వీర్రాజు…

0
497
somu veerraju praise to chandrababu

Posted [relativedate]

somu veerraju praise to chandrababu
ఏపీ బీజేపీ లో సోము వీర్రాజు ఫైర్ బ్రాండ్.ఆయన మాట్లాడినా,మాట్లాడకపోయినా వార్తే. ఏపీ లో పార్టీ కి సారధ్యం వహించాలని ఉవ్విళ్ళూరిన సోముకి కాలం కలిసి రాలేదు.బాబుతో పంచాయితీకి బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లుగా ఆయన మౌనంగానే వుంటున్నారు.అయితే ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వీర్రాజుకి కాస్త జోష్ వచ్చింది.ఆయనకి అసెంబ్లీ సమావేశాలు కలిసి వచ్చాయి .పనిలోపనిగా టీడీపీ తమని కొత్తిమీర లా వాడుకుంటోందని,మోడీ ఫోటో వాడకపోవడం వల్లే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారని కామెంట్ చేశారు.రాజధాని విషయంలో ఇంత హడావిడి ఎందుకని ప్రశ్నించారు.ఇంతలో ఏమైందో ఏమోగానీ హఠాత్తుగా సోము కత్తి మడిచిపెట్టేసారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పని చేయడం వల్లే ఉత్తరాంధ్రలో బీజేపీ అభ్యర్థి గెలిచాడని సోము వివరణ ఇచ్చారు.ఇక రాజధాని గురించి తాను తప్పుగా మాట్లాడలేదని ..విలేకరులు తప్పుడు వార్తలు రాసారని ఓ రొటీన్ డైలాగు వేశారు.సోము హఠాత్తుగా కత్తి మడిచి పెట్టడం వెనుక కారణం ఏంటా అని ఆరా తీస్తే ఓ విషయం బయటికి వచ్చింది.మే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.కిందటి సారి వచ్చినప్పుడు ఆయన మిత్రపక్షం టీడీపీ ని ఇబ్బందిపట్టొద్దని సోముకి క్లాస్ పీకారు.తాజా కామెంట్స్ ఇలాగే సాగదీస్తూ పోతే అమిత్ ఏమంటాడో అన్న భయంతో సోము ప్రస్తుతానికి కత్తి మడిచిపెట్టి తెల్ల జెండా పెట్టేసారు.ఎంతైనా రాజకీయ నేత కదా ..

Leave a Reply