హైకమాండ్ కోసం నోరు విప్పిన సోము..

  somu veerraju price chandrababu because high command
అధిష్టానం ఊ కొట్టకముందే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయినట్టే ప్రవర్తించిన సోము వీర్రాజు కి బీజేపీ హైకమాండ్ తలంటినట్టు వార్తలు వస్తున్నాయి. ప్యాకేజ్ ప్రకటన తరువాత ఈయనతో సహా కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చాడీలు చెప్పబోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మందలించినట్టు సమాచారం.ఒక టైం లో వెంకయ్యకి ,చంద్రబాబుకి వ్యతేరేకంగా మాట్లాడితే ప్రోత్సహించిన వాళ్ళే ఇలా యూ టర్న్ తీసుకోవడంతో ఏపీ కమలం నేతలు ఖంగుతిన్నారట.ఇంత జరిగాక గానీ సోము వీర్రాజు తీరు మారలేదు..

ఓ వైపు బీజేపీ కేంద్రమంత్రులంతా …వెంకయ్య సహా…చంద్రబాబుకి చెప్పి ఆయన ఒప్పుకున్నాకే ప్యాకేజ్ ప్రకటన చేశామని చెప్తున్నారు.ప్యాకేజ్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టిన సోము వీర్రాజు మాత్రం బాబు మనసు మార్చుకున్నందుకు సంతోషం ప్రకటించారు .తిట్టిన నోట ఈ పొగడ్తలు కాస్త ఆశ్చర్యం గానే వున్నాయి. ఇక పవన్ కూడా త్వరలోఅర్ధం చేసుకుంటారని సోము మరో డైలాగ్ కొట్టారు.బీజేపీ ని తిడుతున్న పవన్ పుట్టిన రోజు వేడుకల్లో అమెరికా వెళ్లి మరీ పాల్గొన్న సోము ఇక్కడికి వచ్చాక అయన మీదే కామెంట్ చేశారు.ఇదంతా చూస్తుంటే కేవలం హైకమాండ్ అక్షింతలు తప్పించుకోడానికి మాట్లాడుతున్నట్టు వుంది సోము గారు ..

SHARE