టీడీపీ కి బీజేపీ,కొత్తిమీర ఒక్కటేనా ?

 Posted March 25, 2017

somu veerraju says why tdp loss in teachers constituency mlc elections
ఏపీ బీజేపీ లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా వెలిగిపోయి,పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పీఠానికి పోటీపడ్డ సోము వీర్రాజు గొంతు మళ్లీ లేచింది.అప్పట్లో బీజేపీ,టీడీపీ మధ్య గ్యాప్ పెంచడానికి గట్టి ప్రయత్నమే చేసి సైలెంట్ అయిన సోము కి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టినట్టుంది.అందుకే ఎమ్మెల్సీ పదవిలోకి వచ్చాక టీడీపీ విషయంలో ఆచితూచి స్పందిస్తున్న సోము తాజాగా ఆ ముసుగు తొలగించాడు.అసెంబ్లీ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ రాజధాని సహా వివిధ అంశాలపై నోరు తెరిచారు.పరోక్షంగా టీడీపీ సర్కార్ ని టార్గెట్ చేయడానికి బీజేపీ కి కొత్తిమీర టాగ్ తగిలించారు.

ఉపాధ్యాయ,పట్టభద్ర నియోజక వర్గాల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోడానికి సోము వీర్రాజు కారణం కనిపెట్టేసారు.ఉత్తరాంధ్రలో బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలవడానికి ప్రచారంలో ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు ఫోటోలు వాడారంట.అదే మిగతా చోట్ల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు ప్రధాని మోడీ ఫోటో పెట్టకుండా కేవలం బాబు ఫోటో పెట్టడం వల్లే ఓడిపోయారంట.పైగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి తమ పార్టీతో సంప్రదింపులు కూడా జరపలేదని సోము చెప్పారు.అధికార టీడీపీ కి బీజేపీ కొత్తిమీరలా కనిపిస్తోందని ఓ బాంబు పేల్చారు సోము.ఇక రాజధాని డిజైన్ లు ఎలా ఉన్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సోము ఘాటుగా జవాబు ఇచ్చారు.”రాజధానికి ఇంత హడావిడి ఎందుకు ? ఇప్పుడు వున్నది అసెంబ్లీ కాదా..సచివాలయం కాదా ?దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.ఎక్కడైనా ఇంత హడావిడి జరిగిందా ?”అంటూ సోము ఎదురు ప్రశ్నించేసరికి అవాక్కు అవడం విలేకరుల వంతు అయింది.అయితే సోము కోపం టీడీపీ మీద కానీ విలేకరుల మీద కాదులే ..

SHARE