‘బాహుబలి’ని రిజెక్ట్ చేసిన హీరోయిన్.. బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో !

Posted October 15, 2016

 sonam kapoor reject bahubali 2 movie

రాజమౌళి ‘బాహుబలి’ సృష్టించిన చరిత్ర గురించి తెలిసిందే. తెలుగు సినీ ఖాతిని ప్రపంచ వ్యాప్తి చేసింది. భారతదేశ సినీ చరిత్రలో అత్యథిక వసూలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బడా స్టార్స్ సైతం ‘బాహుబలి’లో ఒక్క సీన్ నైనా కనిపిస్తే బాగుణ్ను అని ఆశపడ్డారు. ఇక, బాహుబలిని మించి బాహుబలి సీక్వెల్ కి ప్లాన్ చేశాడు జక్కన్న.

అయితే, పార్టు2 కోసం కొంతమంది కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె బాహుబలి2లో భాగం కానుందనే వార్తలొచ్చాయి.
ఈమెతో పాటుగా మరో పది మంది పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. చివరికి ఇవన్నీ రూమర్లు మాత్రమేనని బాహుబలి టీం క్లారిటీ ఇచ్చింది. అయితే,
గాసిప్స్ లిస్టులో కూడా చోటు దక్కని బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ షాక్ ఇచ్చింది. బాహుబలి2 కోసం సోనమ్ కపూర్ ను సంప్రదించారట. ‘నాకు బాహుబలిలో నటించే అవకాశం వచ్చింది. కథ కూడా అద్భుతంగా  ఉంది. కానీ, అందులో నటించడం కుదరలేదని’ చెపుకొచ్చింది.

ఎంత బిజీగా ఉన్న బాహుబలి లాంటి ఆఫర్ ని వదులుకోవడం సోనమ్ తెలివి తక్కువ తనమే అవుతుందేమో.. ! ఏదేమైనా సోనమ్ వ్యాఖ్యలు సడన్ షాకిచ్చాయి. అంటే.. విషయం ఏమాత్రం పొక్కకుండా రాజమౌళి చాలా మంది హీరోయిన్లని సంప్రదించి ఉంటారని చెప్పుకొంటున్నారు.

SHARE