మళ్లీ అమ్మే..అబ్బాయి వద్దన్నాడు…

congress-chief-sonia-gandhi

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి మరోసారి యువరాజు రాహుల్ గాంధీ నిరాకరించారు. ఢిల్లీలో జరిగిన cwc సమావేశంలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించమని సభ్యులు రాహుల్ మీద ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.అనారోగ్య కారణాలతో ఈ భేటీకి రాలేకపోయిన సోనియానే ఇంకో ఏడాది పాటు అధ్యక్షురాలిగా కొనసాగించాలని cwc తీర్మానించింది.

దేశ రాజకీయాలకు గుండెకాయ లాంటి యూపీ తో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్న ఈ ఏడాదిలో అధికార మార్పిడి ఉండొచ్చని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి.అయితే 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్క ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఊపిరి తీసుకునే నిర్ణయం రాలేదు.దీంతో రాహుల్ నాయకత్వం పై సొంత పార్టీలోనూ అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు తీసుకోడానికి రాహుల్ సిద్ధపడకపోవడంతో మళ్లీ సోనియా మీదే భారం పడింది.

Leave a Reply