రాజకీయాలకు సోనియా గుడ్ బై?

0
475
sonia gandhi goodbye to politics

Posted [relativedate]

sonia gandhi goodbye to politics
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? కాంగ్రెస్ పగ్గాలను ఆమె వదులుకోనున్నారా? సోనియా స్థానంలో ఎవరు రానున్నారో కూడా నిర్ణయించేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ శ్రేణుల నుంచి.

వయస్సు మీద పడడం, అనారోగ్య కారణాలు .. సోనియాను ఇబ్బందిపెడుతున్నాయి. అంతేకాకుండా పార్టీకి యువ నాయకత్వం అవసరమని ఆమె భావిస్తున్నారట. ఇందిరాగాంధీ లాంటి పటిష్టమైన నాయకత్వం పార్టీకి తయారుచేయాలన్నది సోనియా వ్యూహమట. అందుకే ప్రియాంకను కాంగ్రెస్ లో ప్రమోట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్.

త్వరలోనే కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇక కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ శకం మొదలుకానుందట. ఇక నుంచి ప్రతి అంశంపైనా ఆమె నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. 2019లోపే ప్రియాంక రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేస్తుందట. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుంచి యువరాణి పోటీ చేస్తారట. అంతేకాకుండా పార్టీ పగ్గాలు కూడా ప్రియాంక చేతికి వెళ్లనున్నాయని చెబుతున్నారు.

పార్టీ పగ్గాల విషయంలో రాహుల్- ప్రియాంక మధ్య ఓ అండర్ స్టాండింగ్ కూడా జరిగిపోయిందని టాక్. ప్రియాంకను అధికారికంగా పార్టీ అధినేత్రిగా ప్రకటించకపోయినా ఆస్థాయి హోదా ఇస్తారట. ఇక రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారట. అయితే ఉత్తర భారతంలో రాహుల్ గాంధీ.. దక్షిణాది బాధ్యతలు ప్రియాంకకు ఇస్తారని టాక్.

యూపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో మార్పులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలో సీనియర్లను కూడా పక్కకు తప్పిస్తారట. పార్టీ వ్యవస్థ మొత్తం ఇక గాంధీ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోనుందట. సోనియా గాంధీ కూడా ఇలా అయితే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారట. అందుకే తన కూతురు, కొడుకు లకు బాధ్యతలిచ్చేసి రిటైర్ అయిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. మొత్తానికి సోనియాగాంధీ పార్టీని వీడినందుకు కొందరు బాధపడుతున్నా… ప్రియాంక ఎంట్రీతో కాంగ్రెస్ తలరాత మారిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Leave a Reply