రాహుల్ గాంధీకి సోనియా అక్షింతలు?

 Posted March 27, 2017

sonia gandhi scoldings to rahul
విదేశాల నుంచి తిరిగొచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కోపమొచ్చిందా? రాహుల్ గాంధీ తీరుపై ఆమె అసంతృప్తితో ఉన్నారా? రాహుల్ కు క్లాస్ తీసుకున్నారా? అంటే ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ కు తిరిగొచ్చారు. ఈనెల మొదటివారంలో ఆమె ఫారిన్ కు వెళ్లారు. అప్పటికీ.. ఇప్పటికీ దేశ రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. అంతవరకు బాగానే ఉన్నా కొన్నిచోట్ల కాంగ్రెస్ దగ్గరగా వచ్చి అధికారపీఠం కోల్పోవడంపై సోనియాకు కోపమొచ్చిందట. రాహుల్ అసమర్థత వల్లే అలా జరిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా మణిపూర్, గోవాలో ఆధిక్యం వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని సోనియా చాలా సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఫలితాలు వచ్చిన తర్వాత 2,3 రోజుల వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారట. సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని ఉంటే .. ఇలా జరిగేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి ఎందుకు దించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాక్.

ఇక యూపీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుపై సోనియా మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారన్న వాదన ఉంది. అఖిలేశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న తరుణంలో పొత్తు వద్దని ఆమె వారించారట. అయినా ప్రియాంక పట్టుతో రాహుల్ గాంధీ .. ఎస్పీతో దోస్తీకి సిద్ధమయ్యారట. ఈ విషయంలో రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీకి కూడా సోనియా అక్షింతలు వేశారని టాక్.

ఇకపై రాహుల్ గాంధీ కాకుండా మొత్తం నిర్ణయాలన్నీ తానే చూసుకోవాలని సోనియా గాంధీ నిర్ణయించారట. 2019 ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాలన్నీ తానే చూసుకుంటానని సీనియర్లకు కూడా సంకేతాలిచ్చారట. ఏదేమైనా సోనియా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారని తెలిసి .. కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది.

SHARE