రిటైరయ్యాకా.. తప్పని తిప్పలు

0
766
sonia gandhi works after retirement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

sonia gandhi works after retirementసాధారణ ఉద్యోగులు ఉద్యోగం నుంచి రిటైరయ్యాక కృష్ఱా రామా అనుకుంటూ కాలం గడపాలని, ఇన్నేళ్లు బండచాకిరి చేశాం కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కాని రాజకీయ నాయకులు సాధారణం గా ఇలా ఆలోచించరు. చివరిక్షణం వరకు ఏదో చేయా లని ఆరాటపడుతుంటారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి గుర్తుంపు లేకుండా పడివుండేందుకు ఇష్టపడరు. అనారోగ్యం పట్టిపీడిస్తున్నా అన్ని బాధ్యతలు మీదేసుకొని చేస్తామంటారు. ఓ పక్క ఇది మెచ్చుకోదగిందే అయిన ప్పటికీ మరోపక్క ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పనిచేయడం అవసరమా అనిపిస్తుంది.

అయితే కొందరు నాయకులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాదు. ప్రస్తుతం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితి ఇదే. ఆమె తన అనా రోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. ఎందుకోసం? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి దీటైన అభ్యర్థిని ప్రతిపక్షాల తరపున పోటీ చేయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయడమంటే పిల్లి మెడలో గంట కట్టేందుకు ప్రయత్నించడమే.

 

అయినప్పటికీ ఈ ప్రయత్నం చేసే బాధ్యతను ప్రతి పక్షాలు సోనియాకే అప్పగించాయి. దీంతో ఆమె రంగం లోకి దిగారు. ప్రతిపక్షాల్లో దిగ్గజాలవంటి నాయకులున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెసు అధ్యక్షురాలు కృషి చేస్తారని భావించారు. ఈమధ్య ఆమె కలుషితాహారం తినడంతో అస్వస్థత పాలై ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల తరువాత ఆస్పత్రి నుంచి బయటకు రాగానే విశ్రాంతి తీసుకోకుండా పని ప్రారం భించారు. భిన్న సిద్ధాంతాలు, ఆలోచనలు ఉన్న పలుపార్టీల నాయకులతో చర్చలు జరిపిన సోనియా ఇంకా మరికొందరిని కలుసుకుంటూనే ఉన్నారు. సోనియా కృషిని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెచ్చుకోవడం విశేషం. ప్రతిపక్షాల ఐక్యతకు ఆమె పాటుపడుతున్న తీరు ప్రశంసనీయమన్నారు.

bullet n

Leave a Reply