ఆ విలన్ కి “హీరో” మోజు

Posted March 21, 2017

sonu sood says i want to become a hero in a movieప్రస్తుతం హీరోలందరూ  విలన్ రోల్స్ లో నటించడానికి మొగ్గు చూపుతుంటే ఈ విలన్ మాత్రం తనకు హీరోగా నటించాలనుంది అంటూ డిఫరెంట్ రూట్ ని వెతుక్కుంటున్నాడు. జగపతిబాబు, శ్రీకాంత్, ఆదిపినిశెట్టి వంటి హీరోలు ఇప్పుడు విలన్స్ గా నటిస్తుంటే విలన్ గా మంచి ఫాంలో ఉన్న విలన్  మాత్రం తనకు హీరో అవ్వాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఆ హీరో ఎవరో కాదు సోనూ సూద్.

అరుంధతి  చిత్రంలో విలన్  పాత్ర పోషించి కెరీర్లోనే గొప్ప బ్రేక్ అందుకున్న నటుడు సోనూ సూద్.  ఆ తర్వాత జులాయి దూకుడు వంటి సినిమాల్లో  అసామాన్య నటన ప్రదర్శించి మోస్ట్ స్టైలిస్ట్ విలన్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల  బాలీవుడ్లో కూడా  మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్న సోనూ…  హీరో కావాలనే తన కోరికను బయటపెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను అని వెల్లడించాడు. మరి ఈ విలన్ కోరిక మన్నించి హీరో ఛాన్స్ ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలి.

SHARE