నాగబాబుకు సారీ.. ఇవి వర్మ ట్వీట్సేనా?

0
514
sorry to nagababu rgv tweet

Posted [relativedate]

sorry to nagababu rgv tweet
వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌ వర్మ ఇకపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయను అంటూ తన తల్లి, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌, హాలీవుడ్‌ డైరెక్టర్‌ స్పీల్‌ బర్గ్‌లపై ప్రమాణం చేసిన విషయం తెల్సిందే. దాంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరు హీరోలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో వర్మ చేసిన ట్వీట్‌ అందరికి షాక్‌ ఇస్తుంది. వర్మ మారిపోయాడు అనుకున్నాం కాని, ఇంతగా మారిపోయాడు అంటే నమ్మబుద్ది కావడం లేదు అంటూ ఆయన అభిమానులు సైతం విస్తుపోతున్నారు.

ఇంతకు వర్మ తాజాగా ట్విట్టర్‌లో ఏమని పోస్ట్‌ చేశాడంటే.. చిరంజీవి గారి లాంటి అన్నయ్య నాకు ఉండి ఉంటే నేను మాట్లాడిన మాటలకు నేనైతే కొట్టే వాడిని. కాని నాగబాబు గారు మాటలతోనే సరిపెట్టారు, నిజంగా ఆయనకు సారీ చెబుతున్నాను అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. సహజంగా అయితే వర్మ తెలుగులో ట్వీట్‌ చేయడు. మరి ఈ ట్వీట్స్‌ వర్మ నుండి వస్తున్నవేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్మలో ఇంత మార్పును ఏ ఒక్కరు ఊహించలేదు. ఎవ్వరేం అనుకున్నా నేను అనుకున్నట్లుగా ఉంటాను అనే వర్మ ఇలాంటి ట్వీట్స్‌ చేస్తుండటం ఆయన అభిమానులకు రుచించడం లేదు. వర్మ ఆ ట్వీట్స్‌ అన్ని తాను చేసినవి కావు అంటూ బాంబు పేల్చుతాడేమో చూడాలంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.

Leave a Reply