రజని కుమార్తెకు కొత్త సమస్య ..

  soundarya rajinikanth face problem animal welfare board member
రజనికాంత్ రెండోకుమార్తె సౌందర్యకి మరో సమస్య వచ్చిపడింది. వైవాహిక జీవితం దెబ్బతిన్న ఆమె ఆ షాక్ నుంచి కోలుకునేందుకు సినిమా దర్శకురాలిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.బావ ధనుష్ తో సినిమా చేయడానికి కధాన్వేషణలో ఉన్నారు.ఇంతలో ఊహించని ఇబ్బంది ఎదురైంది.ఆమె భారత్ తరపున యానిమల్ వెల్ ఫేర్ బోర్డు రాయబారిగా నియమితులయ్యారు.అది కాస్త మంచి విషయమే అనుకునేలోపే తిరుచ్చి లో ఆమె దిష్టిబొమ్మ దహనానికి దిగింది ఓ సంస్థ.

ఇంతకీ ఆ సంస్థ అభ్యంతరం ఏంటంటే…యానిమల్ వెల్ ఫేర్ బోర్డు వల్లే తమిళనాట జల్లికట్టుని నిషేధించారట.అలాంటి సంస్థలో బాధ్యతలు తీసుకోవడం సౌందర్యకి తగదని వాళ్ళ అభిప్రాయం.సాంప్రదాయాల్ని కాదనే హక్కు ఎవరికీ లేదని వాదిస్తున్న వీరవిళైయట్టు మీత్పు కళగం సంస్థ మరో మాట కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.మురాట్టుకళై సినిమాలో జల్లికట్టు పోరాటం చేసినందువల్లే రజనీకాంత్ ని తమిళులు ఆరాధిస్తున్నారట.ఇప్పుడు అయన కూతురు జల్లికట్టుని వ్యతిరేకిస్తున్న సంస్థ తరపున పనిచేయడం సరికాదంటున్నారు.

SHARE