కొత్త దేవుడండి….

0
1091

  sourabh raj jain act nagarjuna om namo venkatesaya movieఈ మధ్య వరుస హిట్ మూవీస్ తో  దూసుకుపోతూ, తన తోటి హీరోలకు సవాల్ విసురుతున్న హీరో ‘కింగ్ నాగార్జున’. అటు ఫ్యామిలీ, మాస్, రొమాంటిక్  మూవీస్ లోను ,ఇటు భక్తి చిత్రాలలోను  నటిస్తూ ప్రతి పాత్రలో వైవిధ్యాన్ని కనపరుస్తున్నాడు ఈ టాలీవుడ్ మన్మధుడు.

కొత్త కొత్త వాళ్ళను ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేయటంలో నాగార్జున తర్వాతే ఎవరైనా , ఇప్పటి వరకు చాల మందిని ఇంట్రడ్యూస్ చేసాడు, ఇప్పుడు అలాగే ఒక కొత్త దేవుడిని మన టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. అతడెవరో కాదు

హిందీ సీరియల్స్ లో మహా విష్ణువు, రాముడు, కృష్ణుని పాత్రలో ఒదిగిపోయిన సౌరభ్ రాజ్ జైన్. నాగార్జున, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఒక భక్తి రస చిత్రం వస్తుందని అందరికి తెలుసు, ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రకోసం సౌరభ్ రాజ్ జైన్ ని సెలెక్ట్ చేసారు ఈ చిత్రంలో  నాగార్జున  శ్రీనివాసుడి భక్తుడిగా హథీరాంజీ బాబా  పాత్రలో నటిస్తున్నాడు, ఆయన జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొందరిలో సెట్స్ పైకి వెళ్లనుంది

 

Leave a Reply