పుష్కరాల కోసం ప్రత్యేక సెల్ టవర్స్

0
803

AP-Krishna-Pushkaralu-taver

 ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటోంది. ట్రాఫిక్‌ కంట్రోల్‌కు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందో దానికన్నా ఎక్కువగా సిగలింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకుని పుష్కరాల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. యాత్రికులకు సెల్‌ఫోన్‌ సిగల్‌ సమస్యలు తలెత్తకుండా నూతనంగా 28 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

పుష్కరాల్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సిసి టివి ఫుటేజీలను విశ్లేషించి ఎప్పటికప్పడు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించేందుకు నూజివీడు ట్రిపుల్‌ ఐటి విద్యార్థులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌ ట్రాఫిక్‌ సమస్య, ఘాట్‌ల వద్ద రద్దీని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా ముందస్తుగా సిద్ధం చేస్తుంది. అక్కడ నుంచి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం వెళుతుంది. దీనికి గానూ అధికారులకు 400 వాకీటాకీలు అందిస్తున్నారు. హమ్‌ రేడియోలను ఏర్పాటు చేస్తున్నారు.

వీటికి అవసరమైన సిగలింగ్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బేస్‌ స్టేషన్‌లను గుణదల కొండపైన, దుర్గాఘాట్‌, పవిత్రసంగమం, కృష్ణవేణి, పద్మావతి, ముక్య్తాల ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఎఫ్‌ఎం తరహాలో ఐదు ఛానల్స్‌లో ఘాట్‌ల వద్ద అధికారులకు, సిబ్బందికి రేడియో ద్వారా సమాచారం అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారికి కేటాయించబడిన ప్రాంతానికి అందించే ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ ప్రాంతంలో అధికారులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఐదు రేడియో ఫ్రీక్వెన్సీలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి.

Leave a Reply