చిన్నమ్మకి ఇంటి భోజనం,స్పెషల్ రూమ్

0
312
special room to seshikala in jail

Posted [relativedate]

special room to seshikala in jail
బెంగళూరు లోని పరప్పణ అగ్రహార జైలు నుంచి ఎప్పుడెప్పుడు తమిళనాడులో వాలదామా అని ఎదురుచూస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఉరఫ్ చిన్నమ్మ కి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. తనకు ప్రాణభయం ఉన్నందున తమిళనాడులోని ఏదో ఓ జైలుకి మార్చాలని ఆమె ఇప్పటికే పరప్పణ జైలు అధికారులకి ఓ లేఖ రాశారు.దానిపై ఇంకా నిర్ణయం రాలేదు గానీ అంతకుముందు జైల్లో తనకు ప్రత్యేక గది,ఇంటి భోజనానికి అనుమతించాలని కోర్టుని ఆశ్రయించారు.ఈ రెండు కోరికలకు కోర్టు అనుమతి లభించింది.దీంతో జైలు అధికారులు ఆమెకి ప్రత్యేక గది కేటాయించారు.ఇకపై ఆమెకి ఇంటి భోజనం కూడా రానుంది.మరోవైపు పరప్పణ నుంచి శశికళని తమిళనాడులోని ఏదో ఓ జైలుకి తరలించేలా ఆదేశాల కోసం సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Leave a Reply