హోదా ముప్పు బాబుకే ..కమల వ్యూహమిదేనా ?

 special status dangerous babu bjp do like that

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేకహోదా దక్కాలంటే 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఒప్పించాలని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపికి ప్రత్యేకహోదా కోరుతూ శనివారం చిత్తూరు పట్టణంలోని గాంధి సర్కిల్ వద్ద స్ధానిక జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుండి రూ. 4 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు నిధుల ఖర్చు నివేదికను ఏపి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు

SHARE