మరిన్ని భారతీయ భాషల్లో స్పైడర్ మ్యాన్..

Posted March 28, 2017

Spider Man- Homecoming movie release in india somany languagesప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని సినిమాలను ప్రతిఒక్కరూ చూస్తుంటారు. ఇందులో హీరో చేసే విన్యాసాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంటాయి. ఇక చిన్న పిల్లలైతే ధియేటర్ లో స్పైడర్ మ్యాన్ సినిమా ఆడుతోందంటే చాలు అది చూసేదాకా  నిద్రపోరు. అలానే టీవీల్లో వచ్చినా  టీవీలకు అతుక్కుపోతుంటారు. అటువంటి స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఇండియాలో కూడా బోలెడు మంది అభిమానులు ఉన్నారు. దీంతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ మూవీని డబ్ చేశారు.. కోట్లల్లో కలెక్షన్లను కొల్లగొట్టారు. కాగా ఇప్పుడు తాజాగా రిలీజ్ కానున్న స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్ చిత్రం  మరిన్ని భారతీయ భాషల్లో రిలీజ్ కి రెడీ అయ్యింది.

టామ్‌ హొలాండ్‌ స్పైడర్‌ మాన్‌ గా కనిపించబోతున్న ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠీ భాషల్లో కూడా విడుదలకానుంది. కాగా ఇన్ని భారతీయ భాషల్లో విడుదలవుతున్న తొలి హాలీవుడ్‌ సినిమా ఇదేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ స్పైడర్ మ్యాన్ అభిమానులను ఎలా అలరిస్తాడో  చూడాలి.

SHARE