సాలెపురుగు చెప్పిన జీవిత పాఠం..

Spread the love

Posted [relativedate]

spider our life changing storyకోపానికి బధ్ధ శత్రువు ఓర్పు…ఓర్పు కి ప్రతీక – సాలెపురుగు.

గదిలొ ఒక మూల…..నిశబ్దంగా ఓర్పుగా, ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది. ఎవరిని సహాయం అడగకుండా,ఎవరినీ బాదించకుండ…తన నుంచి తాను విడివడుతూ…తనని తాను త్యాగం చేసుకుంటు,పోగు తరవాత పోగు…గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు గొప్ప నైపుణ్యంతో ఒక వైద్యుడు నరాల్ని ముడులు వేసినట్టు, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.

అంతలో… ఒక హడావుడి ఉదయాన్నో, నిశబ్ద సాయంత్ర సమయాన్నో,గోడమీది నుంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపురుకట్ట,ఒక్క వేటుతో దాని శ్రమంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. సర్వనాశనమైయిపోయిన సామ్రాజ్యంలోంచి,సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది. ఎవరినీ కుట్టదు.ఎవరి మీదా…. కోపం ప్రదర్షించదు.మళ్ళీ తన మనుగడ కోసం,కొత్త వంతెన నిర్మించుకోవడానికి,సహనమనే పోగుల్ని….నమ్మకం….అనే… గోడల మీద తిరిగి స్రవిస్తుంది.ఎలా బ్రతకాలో… మనిషి కి పాఠం చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here