ఈరోజు పుష్కరాల్లో మహిళారాజ్యం..

  sravana sukravaram ladies kingdom pushkara snanamతెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఎనిమిదో రోజు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతాలు..ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి పుష్కర ఘాట్లకు యాత్రికులు తరలివస్తున్నారు. అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్న పుష్కరాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎనిమిదోరోజు కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరాలు ముగిసే రోజులు దగ్గర పడుతుండడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పుష్కరస్నానమాచరించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
పాలమూరు జిల్లాలోని బీచుపల్లి, రంగాపురం, గొందిమళ్ల, పసుపుల, కృష్ణా, సోమశిల, నదిఅగ్రహారం ఘాట్లు, కిటకిటలాడాయి. నల్లగొండ జిల్లాలో ఘాట్లవద్ద పోలీసులు ఆంక్షలను ఎత్తివేశారు. ఘాట్లకు 800 మీటర్ల దూరం వరకు ఆర్టీసీ బస్సులు, 2 కి.మీ. దూరం వరకు ప్రైవేటు వాహనాలు అనుమతిచ్చారు. అక్కడి నుంచి భక్తులను ఉచిత ఆర్టీసీ బస్సుల్లో ఘాట్లకు చేరుస్తున్నారు. ఘాట్లలో సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్ లో భక్తులు పోటెత్తారు.
SHARE