శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు రివ్యూ…

0
581

srirasthu-subhamastu-review

చిత్రం : శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు (2016)
న‌టీన‌టులు : అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి
సంగీతం : థ‌మ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ప‌ర‌శురామ్‌
బ్యాన‌ర్‌ : గీతా ఆర్ట్స్‌
నిర్మాత‌ : అల్లు అర‌వింద్‌
రిలీజ్ డేట్‌ : 05 ఆగ‌స్టు, 2016

‘మెగా సినిమా’ అంటే దుమ్మురేగాల్సిందే. ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలంతా.. కాస్త ముందో, వెనకో మెగా గౌరవాన్ని నిలబెట్టారు. ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన మెగా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు సైతం దూసుకెళ్తున్నారు. అయితే, మెగా హీరోల్లో అల్లు శిరీష్ మాత్రం కాస్త వెనకపడినట్టే కనబడుతున్నాడు. ‘గౌరవం’తో ఎంట్రీ ఇచ్చిన మెగా గౌరవాన్ని నిలబెట్టలేకపోయాడు. ‘కొత్త జంట’తోనూ కొత్తగా ఏమీ నిరూపించుకోలేదు. అయితే, శిరీష్ తాజా చిత్రం “శ్రీరస్తు శుభమస్తు”తో మాత్రం హిట్ కొట్టేలా కనబడ్డాడు. కొద్దిరోజులుగా సందడి చేస్తోన్న ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్స్ ని చూస్తే ఈసారి శిరీష్  పై నమ్మకం కలిగింది. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో శిరీష్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించింది. థ‌మ‌న్ స్వ‌రాలందించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై శిరీష్ బోలేడు ఆశలు పెట్టుకొన్నాడు. మరి.. శిరీష్ ఆశలు నిజమయ్యాయా ? శ్రీరస్తు శుభమస్తు ప్రోమోలు, పోస్టర్స్  తీసుకొచ్చిన హైప్ ఎంత వరకు ప్లస్ అయ్యింది. ఇకపై శిరీష్ కెరిర్ కి శుభమస్తు కలిగినట్టేనా.. ?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం.. పదండీ..

కథ :
ప్రకాష్ రాజ్.. పేరున్న బిజినెస్ మేన్. ఆయన కొడుకు శిరీష్ (అల్లు శిరీష్). బిజినెస్ పనిమీద కాశ్మీర్ వేలి కి వెళ్లిన శిరీష్..  టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య (లావణ్య త్రిపాఠి)ని కాపాడుతాడు. గాయపడ్డ అనన్యని హాస్పటల్ లో జాయిన్ చేస్తాడు. దాంతోపాటుగా ప్రేమలో కూడా పడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ప్రేమలో పడ్డాక అమ్మాయి వివరాలు కనుక్కోకుండా ఉంటాడా..? మనోడు అదే చేస్తాడు. అనన్యది వైజాగ్. వైజాగ్ గీతమ్స్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోందని తెలుసుకొంటాడు. ఇక, లవ్ మేటర్ ని తండ్రి దృష్టికి తీసుకెళ్తాడు శిరీష్. మిడిల్ క్లాస్ కుటుంబాలన్నీ వాళ్ళ అమ్మాయిల్ని ధనవంతులకిచ్చి పెళ్లి చేసి ఓవర్ నైట్ లో సెటిల్ అయిపోవాలని చూస్తుంటాయనే అభిప్రాయంతో ఉండే.. ప్రకాష్ రాజ్.. శిరీష్ లవ్ ని గట్టిగా తిరస్కరిస్తాడు. దీంతో.. తమ కుటుంబ నేపధ్యం చెప్పకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా అనన్యని ఒప్పిస్తానని ఛాలెంజ్ చేస్తాడు శిరీష్. ఆ తర్వాత వెళ్లి అనన్యకి ప్రపోజ్ చేస్తాడు. ఇంతలో మరో ట్విస్టు.. అనన్య తండ్రి ఆమె కోసం పెళ్లి కూడా సెట్ చేస్తాడు. తండ్రితో చేసిన ఛాలెంజ్ లో శిరీష్ గెలిచాడా.. ? అనన్య ఎలా పెళ్లి చేసుకొన్నాడు.. ?? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* డైలాగ్స్
* అల్లు శిరీష్

* కామెడీ
* కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
* రొటీన్ స్టోరీ
* స్లో నారేషన్
* మొదటి భాగంలో సాగదీత

పర్ ఫామెన్స్ :
దర్శకుడు పరుశరామ్.. రొటీన్ కథని నమ్ముకొన్నాడు. అంతే కంటే పరమ రొటీన్ కథనంతో ప్రేక్షకుకు నిట్టూర్పుచ్చేలా చేశాడు. కాకపోతే.. కథకి కామెడీ కోటింగ్ ఇవ్వడంలో కాస్త సఫలమయ్యాడనే చెప్పాలంటే. లేదంటే.. శ్రీరస్తు శుభమస్తు.. అట్టర్ ప్లాప్ చిత్రంగా నిలిచేదే. గత చిత్రాలతో పోలిస్తే.. శిరీష్ నటనలో మెచ్యూరిటి కనపరిచాడు. అయినా.. ఇంకా మెరుగుపడాల్సిందే. ఎమోషనల్ సీన్స్ లో శిరీష్ మొహం చూడలేం. శిరీష్ పై పెద్దగా క్లోజింగ్ షాట్స్ కూడా లేవు. లావణ్య త్రిపాఠి అందం, అభినయంతోనూ ఆకట్టుకొంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు తప్ప మిగితా క్యారెక్టర్స్ పెద్దగా రిజిస్టర్ కావు.

సాంకేతిక విభాగం :
గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే సినిమాలంటేనే రిచ్ గా ఉంటాయి.  శ్రీరస్తుశుభమస్తు కూడా కాస్లీగా కనిపిస్తోంది. ఈసారి థమన్ దంచికొట్టడం కాస్త తగ్గించి.. పాటలు వినిపించేలా చేశాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఫోటో గ్రఫీ బాగుంది. కొన్ని చోట్ల ఇంకా కత్తెర పెడితే బాగుణ్ను. మొత్తానికి.. సాంకేతికంగా శ్రీరస్తు శుభమస్తు బాగానే ఉందని చెప్పొచ్చు.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
శ్రీరస్తు శుభమస్తు.. రొటీన్ కామెడీ లవ్ స్టోరీ. సినిమాలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కోసం ‘శ్రీరస్తు శుభమస్తు’ చూడొచ్చు.

బాటమ్ లైన్ : శ్రీరస్తు శుభమస్తు.. రొటీన్ మస్త్

 రేటింగ్ :2.75/5

Leave a Reply