చిత్రం : శ్రీరస్తు శుభమస్తు (2016)
నటీనటులు : అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి
సంగీతం : థమన్
దర్శకత్వం: పరశురామ్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాత : అల్లు అరవింద్
రిలీజ్ డేట్ : 05 ఆగస్టు, 2016
మెగా హీరో సినిమా వస్తుందంటే హంగామా ఏ రేంజ్ ఉంటుందో తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలందరూ మెగా క్రేజ్ ని అందిపుచ్చుకొన్నారు. ఒక్క అల్లు శిరీష్ తప్ప. ‘గౌరవం’తో ఎంట్రీ ఇచ్చిన శిరీష్ మెగా గౌరవం నిలపడం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. గౌరవం, కొత్తజంట నిరాశపరిచినా.. శిరీష్ తన ప్రయత్నాలని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా, “శ్రీరస్తు శుభమస్తు” అంటూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సోలో, ఆంజనేయులు సినిమాల డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. థమన్ స్వరాలందించాడు. ఎలాగైనా అల్లు శిరీష్ ని మెగా హీరోలందరితో సమానంగా నిలబెట్టేందుకు గీతా ఆర్ట్స్ మరోసారి రంగంలోకి దిగింది. “శ్రీరస్తు శుభమస్తు”ని కాస్లీగా, కలర్ ఫుల్ గా తెరకెక్కించింది. రిలీజ్ కి ముందే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సారైనా శిరీష్ హిట్ కొట్టేలాగానే కబనపడుతున్నాడు. ఓడిపోవడం తప్పు కాదు… విజయం కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించకపోవడం అసలైన తప్పు. శిరీష్ మరోసారి విజయం కోసం పోరాడుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి.. శ్రీరస్తు శుభమస్తు.. అల్లు శిరీష్ కి విజయోస్తు గా మరుతుందా.. ? అన్నది చూడాలి. ఈలోపు శ్రీరస్తు శుభమస్తు విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..
ప్రివ్యూ :
* ‘శ్రీరస్తు శుభమస్తు’ టైటిల్ లోనే ఫ్యామిలీ ఆడియెన్స్ కరెక్ట్ గాకనెక్టయ్యేలా ఉంది
* శ్రీరస్తు శుభమస్తు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కింది.
* ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ప్రేమలో పడతారు
* వాళ్ల ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు
* అప్పుడు ఆ జంట వారి ప్రేమను సక్సెస్ చేసుకునేందుకు ఏం చేశారు ? అన్నదే స్టోరీ.
* స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీగా దర్శకుడు పరశురాం డీల్ చేసినవిధానం ఆకట్టుకుంటుందట.
* ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాకు బాగా చోటుండే ఛాన్స్ ఉందట
* లావణ్య త్రిపాఠి మంచి ఫాంలో ఉంది.
* ఇది శ్రీరస్టు శుభమస్తుకి కలిసొచ్చే అంశం.
* ఇప్పటికే సినిమాపై పాజిటివ్ రావడం ప్లస్ పాయింట్గీ
* గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాణవిలువలు సూపర్బ్‌గా ఉంటాయి.
మొత్తానికి… తొలి హిట్ కొట్టేందుకు అల్లు శిరీష్ వందశాతం ప్రిపేర్ అయి వస్తున్నాడు. మరి సినిమా రిలల్ట్ ఏవిధంగా ఉంది. శ్రీరస్తు శుభమస్తు లైప్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.. మీ తెలుగుబుల్లెట్ డాట్ కామ్.