జింబాబ్వే పై శ్రీ లంక ఘన విజయం..

Posted November 11, 2016

sri lanka won test series in zimbabweహరారే లో జరుగుతున్నా రెండో టెస్ట్ మ్యాచ్ లో శ్రీ లంక ఘన విజయం సాధించింది. రంగన్ హెరాత్‌ (8/63) రికార్డు బౌలింగ్‌తో దాడి చేయడంతో శ్రీలంక 257 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. సిరీ్‌సను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 491 పరుగుల లక్ష్యంతో ఐదోరోజైన ఆట కొనసాగించిన జింబాబ్వే.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెరాత్‌ బౌలింగ్‌ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన హెరాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు కూల్చాడు. తద్వారా జింబాబ్వేలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (8/63) తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 258/9 (డిక్లేర్డ్‌) పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 504, జింబాబ్వే 272 పరుగులు చేశాయి. సిరీ్‌సలో రంగన మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో హెరాత్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టుల్లో మురళీధరన్‌ తర్వాత వేగంగా 350 వికెట్ల మార్కును చేరుకున్న రెండో శ్రీలంక స్పిన్నర్‌గా రంగన ఘనత సాధించాడు. 75 టెస్టుల్లో హెరాత్‌ ఈ మార్కును చేరుకున్నాడు. జింబాబ్వే గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు (13) తీసిన బౌలర్‌గానూ హెరాత్‌ రికార్డులకెక్కాడు. ఈ రికార్డు గతంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ (12/152, 2005లో) పేరిట ఉంది. అదేవిధంగా కెప్టెన్‌గా ఓ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రంగన నిలిచాడు. 1985లో అడిలైడ్‌లో కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ ఆసీస్ పై (8/106) ఈ ఘనత సాధించాడు

SHARE