Posted [relativedate]
అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీదేవి కూతురు జాన్వి ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇందులో విశేషమీ లేదు. కానీ ఆమె ప్రేమించింది ఎవర్నో కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనువడు శిఖర్ పహారియాను. ఇదే ఇప్పుడు హాట్ న్యూస్. అంతేకాదు ఇద్దరి లిప్ లాక్ ఫోటోలు ఆ మధ్య ఇంటర్నెట్ లోనూ హల్ చల్ చేశాయి. అయితే ఈ వీరిద్దరి ప్రేమకథ శ్రీదేవికి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. బాయ్ ఫ్రెండ్ ను పక్కనబెట్టి ముందు సినిమాలపై దృష్టి పెట్టాలని కూతురుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందని టాక్. కానీ ఇప్పుడది అబద్ధమని తేలిపోయింది
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, అలియా భట్ నటించిన డియర్ జిందగీ … సినిమా స్పెషల్ స్క్రీనింగ్ షోలో శ్రీదేవి .. తన కూతురు జాన్వి, అతని ప్రేమికుడు శిఖర్ ను వెంటబెట్టుకొని వచ్చింది. అంతేకాదు శ్రీదేవితో పాటు ఆమె భర్త బోనీ కపూర్ కూడా ఈ షోకు వచ్చారు. జాన్వి లవ్ మ్యాటర్ కు… శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టే యువ ప్రేమికులు ఇద్దరూ షోకు వచ్చారని ఇప్పుడు స్పష్టమైపోయింది.