మహేష్ ముదిరిపోయాడా.. శ్రీదేవి అందుకే వద్దందా ?

0
699
sridevi rejected mahesh babu

 

sridevi rejected mahesh babuటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? గ్లామర్ కే అయన పర్యాయపదం. సినిమా బాగాలేకపోయినా ఆయన్ని చూస్తూ కూర్చోలేమా అనుకునే అభిమానులు ఎందరో.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం మహేష్ పక్కన ఓ ఛాన్స్ వస్తే చాలనుకుంటారు. అలాంటి మహేష్ సినిమాని ఇంకా ఒక్క సినిమా కూడా చేయని ఓ అమ్మాయి వద్దన్నదంట. పైగా యంగ్ హీరోల పక్కన అయితే బాగుంటుందని ఆ అమ్మడి అమ్మ కూడా అన్నదంట.

ఇంతకీ ఆ అమ్మ ఎవరో కాదు అతిలోకసుందరి శ్రీదేవి. కూతురు జాహ్నవిని వెండితెరకు పరిచయం చేస్తామని మురుగదాస్ వెళ్తే శ్రీదేవి ఒప్పుకోలేదట. పిల్లకు యాక్టింగ్ లో ట్రైనింగ్ అని చెప్పి పంపిందట. కానీ సన్నిహితులతో మాత్రం ఎవరైనా స్టార్ హీరో కొడుకు తొలిచిత్రం అయితే బాగుండు అని అన్నదంట. శ్రీదేవి డెసిషన్ చాలా మందికి ముఖ్యంగా మహేష్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తోంది. కానీ సినీరంగంలో అన్నేళ్లు ఏలిన శ్రీదేవి ఆలోచన ఏమిటోమరి ..

Leave a Reply