శ్రీదేవి కూతురా.. మజాకా!

 Posted February 14, 2017sridevis daughter jhanvi makes her relationship official with akshat ranjan

త్వరలోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోహీరోయిన్ల వారసుల్లో శ్రీదేవి కూతురు జాహ్నవి పేరు ముందుంటుంది. ఆమెను  హీరోయిన్ గా నటింపజేసేందుకు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసింది శ్రీదేవి. కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జాహ్నవి.. తాను ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోలతో పాటు అప్పుడప్పుడు కొన్ని ఇంట్రస్టింగ్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంది. దీంతో ఆమె శేఖర్ పహేరియా అనే కుర్రాడితో డేటింగ్ లో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి  రూమర్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత  ఆమె అక్షత్ రంజన్ అనే యంగ్ స్టర్ తో డేటింగ్ లో ఉందన్న వార్త పుట్టుకొచ్చింది. తాజాగా జాహ్నవి షేర్ చేసిన ఓ ఫొటోతో ఈ వార్త నిజమనే అంటున్నారు సినీ అభిమానులు.

అక్షత్ రంజన్ తో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను జాహ్నవి షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె తల్లి దండ్రలు శ్రీదేవి, బోనీకపూర్ కూడా ఉండడం విశేషం. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా  జాహ్నవి పబ్లిక్ గానే అక్షత్ తో రిలేషన్ మెయిన్ టేన్ చేస్తోందా లేక అక్షత్.. జాహ్నవికి ఫ్యామిలీ ఫ్రెండా అన్న విషయం తెలియాల్సిఉంది. ఏది ఏమైనా జాహ్నవిని చూసిన వాళ్లు జాహ్నవి… తన తల్లినే మించిపోయిందని, శ్రీదేవి కూతురా.. మజాకానా అని గుసగుసలాడుతున్నారు.

SHARE