పోలీస్ పోయాడు…మెంటల్ మిగిలాడు

0
407

srikanth mental1

శ్రీకాంత్ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రానికి ‘మెంటల్ పోలీస్’ అనే టైటిల్ ని పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పైనే కాక పాత్రను తీర్చిదిద్దిన తీరు పైనా.. హైద్రాబాద్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హీరో – దర్శకనిర్మాతలకు నోటీసులు కూడా పంపారు.

ఈ నేపథ్యంలో తమ సినిమాలో పోలీసులను..కించపరిచేలా ఏ విధమైన సన్నివేశాలు లేవని మూవీ మేకర్స్ వివరణ ఇచ్చినా పోలీస్ అసోసియేషన్ సంతృప్తి చెందలేదు. ఈ వివాదాల మధ్యే సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసిన నిర్మాతలు.. చివరకు సెన్సార్ కు పంపారు. ఈ సినిమా పేరుపై సెన్సార్ బోర్డ్ కూడా అభ్యంతరాలు వ్యక్తమవడంతో దర్శకనిర్మాతలు టైటిల్ మార్చాలని నిర్ణయించారు. తమ చిత్రానికి ‘మెంటల్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పారు. సెన్సార్ క్లియరెన్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదలకానుంది.

Leave a Reply