హీరోయిన్‌గా అవకాశాల కోసం రెచ్చి పోతుంది

Posted [relativedate]

srimukhi crossed limits for heroine chance
బుల్లి తెరపై హాట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి వెండి తెరపై తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో చాలా లావుగా ఉన్న శ్రీముఖి సినిమాల కోసం చాలా బరువు తగ్గింది. అడపా దడపా సినిమాలు వస్తున్నప్పటికి హీరోయిన్‌ ఛాన్స్‌లు మాత్రం రావడం లేదు. తాజాగా ఈమె ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించింది. అది విడుదలైతే హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయనే నమ్మకంతో శ్రీముఖి ఉంది.

ప్రస్తుతం బుల్లి తెరకే పూర్తిగా పరిమితం అయిన శ్రీముఖికి పలు చిన్న చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వస్తున్నాయి. ఐటెం సాంగ్స్‌ కోసం కూడా ఈమెను నిర్మాతలు సంప్రదిస్తున్నారు. అయినా కూడా ఈమె హీరోయిన్‌ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. హీరోయిన్‌గా నటించి, అందాల ప్రదర్శణ చేసేందుకు కూడా ఈమె సిద్దంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా తెలుగులో రాణించడం చాలా అరుదు. అందుకే తెలుగుతో పాటు ఈమె తనకున్న పరిచయాలతో తమిళనాట కూడా ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. బుల్లి తెరనే తన అందాతో హీట్‌ ఎక్కిస్తున్న శ్రీముఖికి వెండి తెరపై పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశం వస్తే అందాల విందు చేసి రెచ్చి పోవడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here