టీఆర్ఎస్ ను వీడే యోచ‌న‌లో గౌడ్?

Posted March 21, 2017

srinivas gaud planning to leave trs
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంత్రి ప‌ద‌వి ఆశ‌లు అడియాస‌లైపోయాయా? ఇక మంత్రిప‌ద‌వి రాద‌ని ఆయ‌న డిసైడ్ అయిపోయారా? అందుకే అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారా? టీఆర్ఎస్ ను వీడే యోచ‌న‌లో ఆయ‌న‌ ఉన్నారా? అంటే ఏమైనా జ‌ర‌గొచ్చంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.

టీజీవో నేత‌గా జేఏసీలో శ్రీనివాస్ గౌడ్ కీల‌క‌పాత్ర పోషించారు. జేఏసీలో కోదండ‌రాం త‌ర్వాత నెంబ‌ర్-2 గా ఎదిగారు. ఆ క్ర‌మంలోనే కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌య్యారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే సీటు వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో శ్రీనివాస్ గౌడ్ కు మినిస్ట్రీ ఇస్తార‌ని సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. అనుకున్న‌ట్టుగానే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంకేముంది తాను మినిస్ట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని గౌడ్ అనుకున్నారు. కానీ రాజ‌కీయాల్లో హామీలన్నీ అమ‌లు కావ‌నే విష‌యం ఆయ‌న‌కు ఆల‌స్యంగా తెలిసింది.

గ‌త కొంత‌కాలంగా మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రగ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ లిస్టులో గౌడ్ పేరు ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక త‌న‌కు మినిస్ట్రీ రాద‌ని గౌడ్ కు అర్థ‌మైంద‌ట‌. అందుకే అసంతృప్తి గ‌ళం వినిపిస్తున్నార‌ని టాక్. ముఖ్యంగా మ‌హబూబ్ న‌గ‌ర్ కు చెందిన కొంద‌రు నాయ‌కులు ప‌నిగ‌ట్టుకొని త‌న‌కు మినిస్ట్రీ రాకుండా అడ్డుప‌డుతున్నార‌ని గౌడ్ ఆరోపిస్తున్నారు.

జేఏసీ నేత‌గా ఉద్య‌మంలో తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. కానీ టీఆర్ఎస్ లో మాత్రం ఉద్య‌మ‌కారుల‌కు మాత్రం స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే భావ‌నలో ఆయ‌న ఉన్నార‌ట‌. ఇక లాభం లేద‌ని టీఆర్ఎస్ ను వీడే యోచ‌న‌లో శ్రీనివాస్ గౌడ్ ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ మేర‌కు స‌న్నిహితుల‌తోనూ మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. కాంగ్రెస్ లేదా బీజేపీలో ఆయ‌న చేర‌వ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. బీజేపీ నేత కిష‌న్ రెడ్డితో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. కాబ‌ట్టి బీజేపీ వైపు ఆయ‌న మొగ్గు చూప‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ నిజంగానే శ్రీనివాస్ గౌడ్.. టీఆర్ఎస్ ను వీడితే మాత్రం … పార్టీకి ఎంతో కొంత ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌వు!!

SHARE