ఎన్టీఆర్ తో అతనికి ఏంటి గొడవ..!

Posted November 28, 2016, 8:52 am

Image result for ntr and comedian srinivas reddy

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా కూడా హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు జూనియర్ కు మధ్య ఉన్న గొడవను బయట పెట్టడం జరిగింది. తారక్ తో సన్నిహితంగా ఉన్న వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకడు. అయితే తారక్ మోతె దగ్గర యాక్సిడెంట్ కు గురైన సమయంలో తారక్ స్నేహితుల్లో ఒకరు శ్రీనివాస్ రెడ్డి వల్లే ఈ యాక్సిడెంట్ అయ్యిందని అన్నాడట వెంటనే తను లేకపోతే ఇలా బ్రతికే వాడే కాదన్నాడట.

అక్కడి నుండి జూనియర్ తో గ్యాప్ వచ్చేసిందని టాక్. అయితే తన గురించి జూనియర్ కు అంతా తెలుసని మా మధ్య ఉన్న ఈ గ్యాప్ తనతో కూర్చోని మాట్లాడుకుంటే సెట్ అవుతుందని అన్నాడు. అంతేకాదు ఎన్.టి.ఆర్ గురించి ఎక్కడెక్కడో.. చెప్తున్నాడని శ్రీనివాస్ రెడ్డి మీద రూమర్స్ వచ్చాయి. అయితే ఈ కారణాలతో శ్రీనివాస్ రెడ్డి తారక్ తో గ్యాప్ వచ్చిందని తెలుస్తుంది. మరి కొంచం చెప్పి చెప్పినట్టుగా విషయం బయట పెట్టిన శ్రీనివాస్ రెడ్డి తారక్ తో గొడవ విషయంలో జరిగిందంతా చెప్పేశాడు.

శ్రీనివాస్ రెడ్డిని ఇన్సల్ట్ చేసిన వ్యక్తి ఎవరు.. తారక్ కు శ్రీనివాస్ రెడ్డికి మధ్యలో డిస్టన్స్ కారణం ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. తారక్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని ఇప్పటికి తన ఇంట్లో ఫంక్షన్స్ కు వస్తుంటాడని.. బయట కనిపించినా ఆప్యాయంగా పలుకరిస్తాడని అన్నాడు శ్రీనివాస్ రెడ్డి. మరి ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తేనే గాని ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది.