ఒంగోలుకు శ్రీను …బాబాయికి జగన్ వార్నింగ్?

0
657
srinivas reddy to ongole and jagan warning to subbareddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

srinivas reddy to ongole and jagan warning to subbareddy
ప్రకాశం జిల్లా టీడీపీ లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది.కానీ అక్కడ వైసీపీ ఎందుకు పుంజుకోవడం లేదు? టీడీపీ అసంతృప్తులు సహా పార్టీకి దూరమైన పాత నేతలు వైసీపీ వైపు ఎందుకు చూడడం లేదు? ఇదే డౌట్ వైసీపీ అధినేత జగన్ కి కూడా వచ్చిందట.వెంటనే అక్కడి పరిస్థితుల మీద ఓ సర్వే జరిపించుకున్నారట.ఆ సర్వే వివరాలు చూసి జగన్ కంగుతిన్నారట.జిల్లాలో పార్టీ పరిస్థితి బాగానే వున్నా నాయకుల మధ్య విభేదాలు, అవగాహన లోపం సరిచేయడానికి హైకమాండ్ తరపున గట్టి ప్రయత్నం చేసే వాళ్ళే లేరట. ఇదేమని ప్రశ్నించడానికి బాబాయ్,ఒంగోలు ఎంపీ వై.వి .సుబ్బారెడ్డి, బంధువు,ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కి కబురు పంపారట.అప్పుడు గానీ అసలు విషయం తెలియలేదట జగన్ కి. సొంత బావాబావమరుదులైన ఆ ఇద్దరి మధ్య విభేదాలు కాదు ఓ అగాధమే ఉందని జగన్ కి భోధపడిందట.

బాబాయ్ సుబ్బారెడ్డి వ్యవహారశైలి మీద జగన్ అసహనం వ్యక్తం చేసి ఇద్దరూ కలిసి పని చేయాలని క్లాస్ పీకారట జగన్.ఆ క్లాస్ పని చేసిందో లేక నిజంగా బావ వై.వి.సుబ్బారెడ్డి తో రాజీకొచ్చారో గానీ బాలినేని వర్కింగ్ స్టైల్ లో పెద్ద మార్పు వచ్చిందట.కొన్నేళ్లుగా పార్టీకి అంటీఅంటన్నట్టున్న బాలినేని యాక్టివ్ అయ్యారట.జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన స్థానాలు, ఓడిపోయిన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ బలోపేతం మీద చర్యలు తీసుకుంటున్నారట. ఇకపై రెగ్యులర్ గా కలిసి పార్టీని ముందుకు నడిపిద్దామని యాక్టివ్ గా లేని నేతలకు కూడా స్ఫూర్తి ఇస్తున్నారట.అందుకోసం ఆయన తన నివాసాన్ని కూడా హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో ఒంగోలు కి మారుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు .మొత్తానికి జగన్ జోక్యం తో బాబాయికి వార్నింగ్, ఒంగోలుకు శ్రీను వస్తున్నారన్న మాట.

Leave a Reply