అనుష్క రోల్ ని కొట్టేసిన శ్రుతి??

Posted February 7, 2017

sruthi hassan to replace anushka in chiru next movie
మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ మూవీతో తనలోని టాలెంట్, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. సంక్రాంతి బరిలో మరో భారీ సినిమాతో పోటీపడి విజయాన్ని సాధించిన చిరు అదే జోష్ తో తన నెక్స్ట్ మూవీ కోసం రంగాన్ని సిద్దం చేస్తున్నాడు.
రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. దీంతో చిరు సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలైంది. అయితే ముందుగా చిరుతో జతకట్టేందుకు అనుష్క పేరు వినిపించినా తాజాగా శ్రుతిహాసన్ పేరు వినిపిస్తోంది.

గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అందుకున్న రేసుగుర్రం సినిమాలో నటించింది శ్రుతి. దీంతో తనకు లక్ ని అందించిన శ్రుతి పేరునే ఇప్పుడీ కొత్త సినిమాలో కూడా సూచిస్తున్నాడట సూరి. అయితే మెగాస్టార్ మాత్రం శ్రుతి తనకి జోడిగా సరిపోదేమో అన్న ఆలోచనతో అనుష్క వైపు మొగ్గు చూపిస్తున్నాడట. అనుష్క ఇప్పుడు బాగా లావుగా ఉందని, ఇంతకు ముందులా తన క్యూట్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకోలేదని సూరి.. చిరుని కన్వెన్స్ చేశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి చిరు కన్వెన్స్ అయ్యాడో లేదో తెలియాలంటే కొన్ని వెయిట్ చెయ్యక తప్పదు.

SHARE