స్టాలిన్ కి బ్లడ్ కాన్సర్?అబ్బా ఆరవ రాజకీయం..

Posted October 4, 2016

 Is Stalin Have Blood Cancer?రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో చూడాలంటే తమిళనాడు కి వెళ్లాల్సిందే..ఓ వైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత 12 రోజులుగా ఆస్పత్రిలో వున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో పుకార్లు ..మరెన్నో వార్తలు ..ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి.అదే టైం లో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెప్పాలని,కనీసం ఫోటోలైనా విడుదల చేయాలని ప్రతిపక్షనేత కరుణానిధి డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఆగ్రహించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ మొదలెట్టారు.

డిఎంకె అగ్రనేత స్టాలిన్ కి బ్లడ్ కాన్సర్ ఉందని..దానికి అయన లండన్ లో చికిత్స చేయించుకుంటున్నారని అన్నాడీఎంకే mla విక్టర్ ఆరోపించారు.లండన్ లో రక్తం మార్పించుకు వస్తున్న స్టాలిన్ అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేయాలని విక్టర్ డిమాండ్ చేశారు.ఇదంతా చూస్తున్న వారికి ఆరవ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.

SHARE