సీఎం కుర్చీపై స్టాలిన్ కన్ను!!!

0
287
stalin plan to become cm of tamil nadu

Posted [relativedate]

stalin plan to become cm of tamil nadu
జైలుకు ప‌రిమిత‌మైన శ‌శిక‌ళ‌కు బ‌య‌టి నుంచే దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారు డీఎంకే నేత స్టాలిన్. ప‌న్నీర్ సెల్వంకు మొద‌ట మ‌ద్దతిస్తాన‌ని చెప్పిన స్టాలిన్.. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. చిన్నమ్మ జైలుకెళ్లిపోవ‌డంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న వార్తలు కూడా వ‌చ్చాయి. బ‌ల ప‌రీక్షకు డీఎంకే దూరంగా ఉంటుంద‌న్న గుసగుస‌లు వినిపించాయి. దీంతో ప‌ళ‌నిస్వామి వ‌ర్గం గెలుపు ఈజీయేన‌న్న అంచ‌నాకు వ‌చ్చింది. రిసార్టులో దాదాపుగా 120 మంది ఎమ్మెల్యేలు ఉండ‌డంతో ఏం కాద‌న్న ధీమాలో ప‌ళ‌ని ఉన్నారు. కానీ అది అంత ఈజీ కాద‌ని తేలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు డీఎంకే సిద్ధంగా ఉంది.

బ‌ల నిరూప‌ణ నేప‌థ్యంలో స్టాలిన్ … పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అంద‌రూ స‌భ‌కు హాజరుకావాల‌ని ఆదేశించారు. అంతేకాదు విప్ కూడా జారీ చేశారు. ఇక స్టాలిన్ … ప‌న్నీర్ సెల్వంకు బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చారట. ఎలాగూ డీఎంకే … సెల్వంకు మ‌ద్దతివ్వక‌పోయినా.. సెల్వం నుంచి మాత్రం స్టాలిన్ మ‌ద్దతు కోరార‌ట‌. ఎందుకంటే ఆయ‌న ద‌గ్గర 11 మంది ఎమ్మెల్యేలున్నారు. వారంతా సెల్వం మాటే వింటారు. కాబ‌ట్టి మద్దతిస్తే తాను అంతా చూసుకుంటాన‌ని ధైర్యం చెప్పార‌ట‌. అటు సెల్వం కూడా మ‌రో దారి లేదు కాబ‌ట్టి… త‌న‌కు మ‌ద్దతివ్వక‌పోయినా… తాను మాత్రం సెల్వంకు మ‌ద్దతివ్వడానికి రెడీ అంటూ సంకేతాలిచ్చార‌ని టాక్. అయితే ముందు ప‌ళ‌నిస్వామి ప్రభుత్వాన్ని ఓడించి… ఆ త‌ర్వాత తాను రేసులోకి వ‌చ్చేందుకు స్టాలిన్ సిద్ధంగా ఉన్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

ప్రస్తుతం 89 మంది డీఎంకె ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్‌కు చెందిన 8 మంది స్టాలిన్ వెంట ఉన్నారు!! అటు పన్నీర్ సెల్వం శిబిరంలోవున్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా స్టాలిన్‌కు స‌పోర్ట్ ఇస్తే.. ఆ సంఖ్య 108కి చేరుతుంది. ఇక‌ ముస్లింలీగ్ ఎమ్మెల్యేని కూడా కలుపుకుంటే స్టాలిన్ స్కోర్ 109. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117. అంటే స్టాలిన్‌కి సీఎం కుర్చీకి కేవలం 8 ఓట్ల దూరం. ఎలాగూ బ‌ల‌నిరూప‌ణ‌లో ఓడిపోతే ప‌ళనిస్వామి వ‌ర్గం విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కొంద‌రు డీఎంకేతో ట‌చ్ లో ఉన్నార‌న్న వాద‌న ఉంది. అంటే ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం ప‌డిపోవ‌డం… స్టాలిన్ కు లైన్ క్లియ‌ర్ కావ‌డం లాంఛ‌న‌మేన‌ని డీఎంకే శ్రేణులు బ‌లంగా న‌మ్ముతున్నాయి. చూడాలి మ‌రి… అస‌లు బ‌ల‌నిరూప‌ణ‌లో ఏం జ‌రుగుతుందో!!!

Leave a Reply