నన్ను చూసి నవ్వొద్దంటున్న స్టాలిన్!!

0
334
stalin says to palaniswamy don't laughing in front of me

Posted [relativedate]

stalin says to palaniswamy don't laughing in front of me
గతంలో పన్నీర్ సెల్వం… డీఎంకే నేత స్టాలిన్ ను చూసి నవ్వడం అన్నాడీఎంకే నాయకులకు పెద్ద వార్త అయిపోయింది. కొందరైతే సెల్వం తీరుపై మండిపడ్డారు. ప్రత్యర్థిపార్టీకి చెందిన వ్యక్తిని చూసి నవ్వడమేంటని ప్రశ్నించారు. ఆ నవ్వు వల్లే.. పన్నీర్ సెల్వం… శశికళకు దూరమయ్యారన్న వాదన ఉంది.

పన్నీర్ సెల్వం పోయారు.. ఇప్పుడు పళనిస్వామి వచ్చారు. దీంతో స్టాలిన్ ఇప్పుడు పళనిస్వామికి కొత్త సూచన చేశారు. కొత్త సీఎంకు శుభాకాంక్షలు చెబుతూనే.. తనను చూసి నవ్వొద్దని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ పళని కూడా నవ్వితే.. ఆయన కుర్చీ కూడా గల్లంతు కావడం ఖాయమట. ఆ రచ్చ ఎందుకు.. తనను చూసి నవ్వొద్దని చెబుతున్నారాయన.

బలపరీక్ష నేపథ్యంలో స్టాలిన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇకపై అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులకు నమస్కారం తప్ప… వారిని చూసి ముసిముసిగా నవ్వడం మానుకోవాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి నవ్వు నలభై విధాలా స్వీటని అందరూ చెబుతుంటే.. స్టాలిన్ మాత్రం నవ్వునాలుగు రకాలుగా చేటు అంటున్నారు. ఎవరైనా నన్ను చూసి ఏడవకు అంటారు కానీ.. నవ్వొద్దు అని స్టాలిన్ చెప్పడం చాలా వింతగా ఉంది!!

Leave a Reply