స్టార్ సినిమాకు కొత్త కలరింగ్

0
641
star hero movies new change

star hero movies new change

కమర్షియల్ ఫార్మెట్ లో కథా వస్తువు ఏది లేకుండా చేసిన సినిమాలతో సూపర్ హిట్లు అందుకుని కెరియర్లో స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోలు ఇప్పుడు సగటు మనిషి జీవితానికి అద్దం పట్టే కథలను తెరరూపం దాల్చుతున్నారు. హీరో అంటే కేవలం ఫైట్స్, యాక్షన్ ఇదొక్కటే కాదు సమాజానికి ఓ మంచి విషయాన్ని చెప్పే వాడై ఉండాలి. అయితే ఆ దారిలో ఇప్పటి హీరోలు నడుస్తుండటం గొప్ప విషయం. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అనే భావన నుండి సినిమా అంటే ఓ విజ్ఞానం అనే స్థాయికి తమ సినిమాల విలువలను పెంచేస్తున్నారు.

ఇదో రకంగా దర్శకనిర్మాతల కొత్త అభిరుచికి తార్కాణమే అనిపిస్తున్నా దానికి స్టార్ హీరోలు కన్విన్స్ అవడం గొప్ప విషయం. ఎప్పుడు రొటీన్ కథలతో ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తున్న హీరోలు ఈ మధ్య కథాబలమున్న సినిమాలతో ప్రేక్షకులకు పరిక్ష పెట్టేస్తున్నారు. అంతేకాదు మారుతున్న ఆడియెన్స్ థోరణిలో ఇప్పుడు అలాంటి సినిమాలకే మంచి రోజులని చెప్పొచ్చు.

ఏది ఏమైనా టాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం ఏర్పడ్డ ఈ పెను మార్పిడి సిని పరిశ్రమకు కొత్త కలరింగ్ తెచ్చి పెట్టింది. స్టార్ సినిమా కాదు కథ ఉన్న సినిమాగా తెరకెక్కడం విశేషం. ఇక ప్రస్తుతం స్టార్స్ మధ్య పెరుగుతున్న ఈ పోటీ కూడా వారిని కొత్త కథల వైపు నడిపించేలా చేస్తున్నాయి. స్టార్ సినిమా.. డైరక్టర్ సినిమా ఇలా లెక్కలేసుకుంటున్న అభిమానులకు ఓ కథ ఉన్న సినిమా అందిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వచ్చిన సినిమాల ఫలితం చూస్తే తెలుస్తుంది.

సో పరిశ్రమకు కొత్త రంగులద్దుతున్న స్టార్ హీరోలు ఎప్పుడు తన్నుకు చావడం అనే కాకుండా కొత్త కథలకు ప్రోత్సాహం ఇవ్వడం నిజంగానే హర్షించదగ్గ విషయం. మరి వచ్చిన ఈ మార్పు కలకాలం ఉంటుందా లేక కొద్ది కాలమేనా అన్నది త్వరలో కొన్ని సినిమాలు చూస్తేనే గాని తెలుస్తుంది.

Leave a Reply